Vinayaka Chavithi 2024: వినాయక చవితి రోజున ఏర్పడనున్న మూడు యోగాలు.. విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం ఎప్పుడంటే

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చవితి తిథిని గణేశుడి జన్మగా పరిగణించబడుతుంది. వినాయక చవితిని 2024 సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. చతుర్థి తేదీ 6 సెప్టెంబర్ 2024న మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే సెప్టెంబర్ 7వ, తేదీ 2024 సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. గణేశుడు మధ్యాహ్నం జన్మించాడని నమ్మకం కనుక గణేశుడిని పూజించడానికి మధ్యాహ్నం సమయం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

Vinayaka Chavithi 2024: వినాయక చవితి రోజున ఏర్పడనున్న మూడు యోగాలు.. విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం ఎప్పుడంటే
Ganesh Chaturthi 2024
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2024 | 3:05 PM

హిందువుల ముఖ్యమైన పండగలలో ఒకటి వినాయక చవితి. విఘ్నాలు కలగకుండా మొదటి పూజను గణపతికి చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకనే హింవులు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు అయినా సరే గణపతిని తలచుకుంటారు. పూజలు చేస్తారు. గణేశుడు పుట్టిన రోజుని వినాయక చవితిగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు వినాయక విగ్రహాన్ని తమ ఇళ్లకు తీసుకువచ్చి ప్రతిష్టించి వినాయకుడిని పూజిస్తారు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. ఈ సారి వినాయక చవితి పండగ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ప్రత్యేకం ఎందుకంటే ఈసారి ఈ ఏడాది వినాయక చవితికి మూడు ప్రత్యెక యోగాలు రూపొందుతున్నాయి. అటువంటి పరిస్థితిలో వినాయక విగ్రహాన్ని శుభ సమయంలో ఆరాధించడం చాలా ఫలవంతంగా ఉంటుంది.

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చవితి తిథిని గణేశుడి జన్మగా పరిగణించబడుతుంది. వినాయక చవితిని 2024 సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. చతుర్థి తేదీ 6 సెప్టెంబర్ 2024న మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే సెప్టెంబర్ 7వ, తేదీ 2024 సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. గణేశుడు మధ్యాహ్నం జన్మించాడని నమ్మకం కనుక గణేశుడిని పూజించడానికి మధ్యాహ్నం సమయం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ఏర్పడనున్న మూడు శుభయోగాలు

ఇవి కూడా చదవండి

వినాయక చవితి సందర్భంగా అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఈ రోజు ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నాయి. ఇందులో సర్వార్థ సిద్ధి యోగం ఉంది. ఈ రోజున అన్ని గ్రహాల స్థానం పరిపూర్ణంగా ఉంటుందని.. ఈ యోగాలో పూజించడం వల్ల కలిగే ఫలితాలు మరింత శుభప్రదంగా ఉంటాయని నమ్మికం. కనుక ఈ యోగా కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ యోగా 7వ తేదీ మధ్యాహ్నం 12:34 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6:30 గంటల వరకు కొనసాగుతుంది.

అంతే కాకుండా ఈ చవితి రోజున రవియోగం కూడా ఏర్పడుతోంది. ఈ యోగం సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9.25 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12.34 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజున బ్రహ్మయోగం కూడా ఏర్పడుతోంది. ఈ యోగం ఏర్పడటం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

విగ్రహ ప్రతిష్ఠాపనకు సరైన సమయం ఏదంటే

వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠాపన కోసం ఇంటికి తీసుకుని రావడానికి సరైన సమయం ఏది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నుంచి వినాయక విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకురావచ్చు. దీని శుభ యోగం ఉదయం 11:03 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 01:34 వరకు కొనసాగుతుంది. అంటే 2024లో గణేశ విగ్రహ ప్రతిష్ఠాపనకు రెండున్నర గంటలు (150 నిమిషాలు) శుభ ముహూర్తం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.