Telangana: గుప్త నిధుల కోసం గుడిని టార్గెట్ చేసిన ముఠా.. ఏకంగా సొరంగమే పెట్టారు కదరా..!
నిధి కోసం అడువుల్ని జల్లెడపట్టడం..పురాతన ఆలయాలను ధ్వంసం చేసేవాళ్లు కేటుగాళ్లు. .ఇప్పుడు ఏకంగా ఆలయ గోపురంపైనే గురిపెట్టారు గుప్తనిధి గ్యాంగ్. గుప్త నిధుల ముఠా.. ప్రాచీన కట్టడాలను టార్గెట్ చేస్తోంది. బంగారం దొరుకుతుందనే ప్రచారంతో తవ్వేస్తున్నారు. పూజలు చేస్తూ తవ్వకాలు చేపడుతున్నారు. స్థానికులు భయబ్రాంతులకు గురి చేస్తోంది ముఠా.
నిధి కోసం అడువుల్ని జల్లెడపట్టడం..పురాతన ఆలయాలను ధ్వంసం చేసేవాళ్లు కేటుగాళ్లు. .ఇప్పుడు ఏకంగా ఆలయ గోపురంపైనే గురిపెట్టారు గుప్తనిధి గ్యాంగ్. గుప్త నిధుల ముఠా.. ప్రాచీన కట్టడాలను టార్గెట్ చేస్తోంది. బంగారం దొరుకుతుందనే ప్రచారంతో తవ్వేస్తున్నారు. పూజలు చేస్తూ తవ్వకాలు చేపడుతున్నారు. స్థానికులు భయబ్రాంతులకు గురి చేస్తోంది ముఠా. తాజాగా పురాతన ఆలయ గోపురాన్ని తవ్వారు గుప్త నిధులు ముఠా.
పెద్దపల్లి జిల్లాలో గుప్తనిధుల కోసం గుడి గోపురానికే కన్నం వేశారు గుర్తు తెలియని దుండగులు. మండలంలోని ముత్తారం గ్రామ శివారులో 250 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారు. పురాతన కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. అంతటి వైభవం ఉన్న ఆలయ గుడి గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి గునపాలు, డ్రిల్లర్లతో కన్నం వేసి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.
గుడి గోపురానికి కన్నం వేసి లోపలికి పొడవైన నిచ్చెనలు వేసుకొని వెళ్లారు దుండగులు. గుడి గోపురం అడుగు భాగంలో సైతం తవ్విన ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఆలయ గోపురానికి ఉన్న విగ్రహాలను, గోడలను, ఆలయం గోపురాన్ని ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసమే ఆలయ గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. అత్యంత రమణీయంగా ఉన్న ఈ ఆలయ గోపురాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తవ్వకాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మరింత లోతుగా తవ్వకాలు చేపట్టడానికి పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇది గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారాని స్థానికులు అంటున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..