AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Manis: గ్రూప్‌ 1 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఇంగ్లిష్ మీడియంలోనూ డిజిటల్‌ పాఠ్యాంశాల ప్రసారం

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్‌ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించగా.. పరీక్షల నిర్వహణకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 32 వేల మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నాపత్రాల రూపకల్పన..

TGPSC Group 1 Manis: గ్రూప్‌ 1 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఇంగ్లిష్ మీడియంలోనూ డిజిటల్‌ పాఠ్యాంశాల ప్రసారం
TGPSC Group 1 Manis
Srilakshmi C
|

Updated on: Sep 01, 2024 | 5:16 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 1: తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్‌ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించగా.. పరీక్షల నిర్వహణకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 32 వేల మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఆన్సర్‌ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. పరీక్షలను హైదరాబాద్‌ పరిధిలో నిర్వహించే అవకాశం ఉంది.

అయితే గ్రూప్‌ 1 మెయిన్‌ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఆంగ్ల భాషలో కూడా డిజిటల్‌ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు టీ-శాట్‌ సీఈవో బోధనపల్లి వేణుగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష రాసే అభ్యర్థులకు ‘క్రాష్‌ కోర్స్‌-100’ పేరిట అర్ధ గంట నిడివి గల పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 20వ తేదీ వరకు ఈ పాఠ్యాంశాలను ప్రసారం చేస్తామని తెలిపారు. ఈ పాఠ్యాంశాలు టీ-శాట్‌ నిపుణ ఛానెల్‌లో ఆయా రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసారమవుతాయని, తిరిగి అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో విద్యా ఛానెల్‌లో అవే అంశాలు పునఃప్రసారమవుతాయని వివరించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

కాగా తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో నిర్వహించనున్న మెయిన్స్‌ పరీక్షలకు ఇప్పటికే అభ్యర్ధులు ముమ్మరంగా సన్నద్ధం అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!