AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రీల్స్‌ మోజులో వెర్రి చేష్టలు.. అతివేగంగా కారునడిపి బైక్‌ను ఢీకొట్టిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్!

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఓవరాక్షన్‌కి అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. పిచ్చి చేష్టతో తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టడంతోపాటు.. చుట్టుపక్కల వారి జీవితాలతోనూ ఆటలాడుతున్నారు. వ్యూస్‌, కామెంట్ల కోసం ప్రమాదకర వీడియోలు తీసి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రజత్ దలాల్ ఇలాంటి వెదవపనే చేసి అందరితో చివాట్లు తింటున్నాడు. కారులో కెమెరాతో షూట్ చేస్తూ..

Watch Video: రీల్స్‌ మోజులో వెర్రి చేష్టలు.. అతివేగంగా కారునడిపి బైక్‌ను ఢీకొట్టిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్!
Fitness Influencer
Srilakshmi C
|

Updated on: Aug 30, 2024 | 7:39 PM

Share

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఓవరాక్షన్‌కి అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. పిచ్చి చేష్టతో తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టడంతోపాటు.. చుట్టుపక్కల వారి జీవితాలతోనూ ఆటలాడుతున్నారు. వ్యూస్‌, కామెంట్ల కోసం ప్రమాదకర వీడియోలు తీసి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రజత్ దలాల్ ఇలాంటి వెదవపనే చేసి అందరితో చివాట్లు తింటున్నాడు. కారులో కెమెరాతో షూట్ చేస్తూ.. రోడ్డుపై మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడమే కాకుండా.. ఓ బైక్‌ యాక్సిడెంట్‌కు కారణం అయ్యాడు. పైగా ఎలాంటి జంకుబొంకు లేకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో వైరల్‌ అవడం అటుంచితే.. ప్రతి ఒక్కరూ తిట్టిపోస్తున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రద్దీగా ఉండే హైవేపై చోటు చేసుకుంది. రజత్ దలాల్ కారును వేగంగా డ్రైవ్‌ చేస్తూ బైక్‌ను ఢీ కొట్టడం వీడియోలో చూడొచ్చు. వీడియో వైరల్‌ మారడంతో రజత్ దలాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియో దృశ్యాలు సర్వత్రా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఈ వీడియోలో ఎస్‌యూవీ కారు వెనుక సీటులో ఉన్న ప్రయాణీకుడు కెమెరాలో వీడియో చిత్రీకరించడం చూడొచ్చు. ఇక ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రజత్ దలాల్ గంటకు 140 కి.మీ వేగంతో కారు నడుపడం వీడియోలో కనిపిస్తుంది. అతని పక్కనే కూర్చున్న ఓ మహిళ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా రద్దీగా ఉన్న రహదారిపై వేగం కారును డ్రైవ్‌ చేస్తుంటాడు. అతి వేగానికి భయపడిన సదరు మహిళ మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయమని అతనిని పదేపదే కోరడం వీడియోలో చూడొచ్చు. అయితే దలాల్ మాత్రం తాపీగా ఎలాంటి భయం అక్కర్లేదని నిరాసక్తంగా జవాబు ఇచ్చాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఎస్‌యూవీ కారు ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోతారు. దీంతో కారులోని మహిళ భయాందోళనకు గురై ‘సార్, అతను కింద పడిపోయాడు. దయచేసి దీన్ని ఇంతటితో ఆపమని’ కోరడం వీడియోలో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేయడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే రజత్‌ దలాల్‌ను అరెస్ట్ చేయాలని, జనాల జీవదితాలతో ఆటలాడే ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

“ఈ వ్యక్తిని త్వరితగతిన అరెస్ట్ చేయాలి. ఇలాంటి వారు సమాజానికి ముప్పు. అధికారులు వెంటనే స్పందించాలి’ అని ఓ యూజర్‌ వినియోగదారు కామెంట్ సెక్షన్‌లో పేర్కొనగా.. రజత్‌ దలాల్‌పై జీవితకాలం లైసెన్స్ నిషేధించినా అతను చేసిన నేరానికి తగిన శిక్ష విధించినట్లు కాదని మరొకరు, చీప్‌ వీడియోలు తీస్తూ జనాల్ని చంపడం వీళ్లకు అలవాటై పోతుంది. ఈ ‘అలవాటు’ విషాదంగా మారకముందే అధికారులు చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చింది’ అని మరొక యూజర్‌ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన ఫరీదాబాద్ పోలీసులు దలాల్‌కు సంబంధించిన ఇతర వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అతడి ఫోన్‌ నంబర్‌ను షేర్ చేయాలని ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. కొంతమంది వినియోగదారులు దీనిని ఫరీదాబాద్‌లోని మధుర రోడ్‌గా గుర్తించడంతో వారు సంఘటన స్థలాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా దలాల్ న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 2023లో 18 ఏళ్ల బాలుడిపై దాడి చేస్తున్నట్లు ఉన్న ఓ సెల్ఫీని పోస్టు చేయడంతో అహ్మదాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.