Elephants: మాంసం కోసం 900 ఏనుగులు, జీబ్రాలు, నీటి గుర్రాలు చంపేందుకు సర్కార్ ఉత్తర్వులు.. ఎక్కడంటే?
ఆఫ్రికా దేశమైన నమీబియాలో కరువు విలయ తాండవం చేస్తుంది. అక్కడి ప్రజలు తినేందుకు ఆహారంలేక, తాగేందుకు నీరులేక విలవిల లాడుతున్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు ఆ దేశంలో తాండవిస్తోంది. దీంతో ప్రజల ఆకలి తీర్చేందుకు నమీబియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ అడవుల్లో సంచరించే 700 అరుదైన అడవి జంతువులను వధించి.. ఆ మాంసం ప్రజలకు పంపిణీ..
నమీబియా, ఆగస్టు 29: ఆఫ్రికా దేశమైన నమీబియాలో కరువు విలయ తాండవం చేస్తుంది. అక్కడి ప్రజలు తినేందుకు ఆహారంలేక, తాగేందుకు నీరులేక విలవిల లాడుతున్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు ఆ దేశంలో తాండవిస్తోంది. దీంతో ప్రజల ఆకలి తీర్చేందుకు నమీబియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ అడవుల్లో సంచరించే 700 అరుదైన అడవి జంతువులను వధించి.. ఆ మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 83 ఏనుగులు, 30 హిప్పోలు (నీటి గుర్రాలు), 60 అడవి దున్నలు, 50 ఇంపాలాలు, 100 బ్లూ వైల్డ్ బీస్ట్, 300 జీబ్రాలను చంపబోతున్నట్లు ఆ దేశ పర్యావరణ, అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రొఫెషనల్ వేటగాళ్లతో వీటిని చంపనునున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. నైరుతి ఆఫ్రికాలో కరవు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నమీబియాలో కరువు ప్రభలడంతో ఈ ఏడాది ఆగస్టులో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 14 లక్షల మంది జనాభా అంటే ఆ దేశంలో దాదాపు సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి అడవుల్లో వన్య ప్రాణుల సంఖ్య అధికంగా ఉందని, వీటిని వధిస్తే అక్కడి నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఏనుగులు అధికంగా ఉంటాయి. అక్కడ దాదాపు 2 లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయి. గతేడాది నీటి వనరులు ఎండిపోవడంతో వందలాడి ఏనుగులు మరణించాయి. ఇప్పటికే ఆ దేశంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించడానికి 150కిపైగా అటవీ జంతువులను వధించి, మాంసం పంపిణీ చేశారు. బోట్సువానాలో 1,30,000 ఏనుగులు ఉండగా.. 2014లో ఏనుగుల వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, కరువుతో అలమటిస్తున్న స్థానికులు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో 2019లో దీనిని తొలగించింది.
దక్షిణాఫ్రికాలోని అనేక దేశాలలో నమీబియా ఒకటి. దీనిపై ఎల్ నినో ప్రభావం అధికంగా ఉంది. దీంతో నమీబియాలో వర్షపాతం బాగా తగ్గిపోయింది. వినాశకరమైన కరువు తాండవిస్తుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం తగ్గడానికి దారితీసిన కారణాల్లో మానవుడు కలిగించే వాతావరణ సంక్షోభం ప్రధానమైంది. అధిక ఉష్ణోగ్రతలతో కూడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయాయి. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న పదిలక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఇతర దేశాలవైపు ఆశగా ఎదురు చేస్తున్నారు.