Watch Video: ఉధృతంగా ప్రవహిస్తోన్న నదిలోకి 50 ఆవులను తోసేసిన ఆకతాయిలు.. 20 ఆవులు మృతి!

ఉధృతంగా ప్రవహిస్తోన్న నదిలో మూగజీవాలను తోసి కొంతమంది ఆకతాయిలు సునకానందం పొందారు. దాదాపు 50 ఆవులను నదిలోకి ఉద్ధేశ పూర్వకంగా తోసేశారు. వీటిల్లో 20 ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో నాగోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (ఆగస్టు 27) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు..

Watch Video: ఉధృతంగా ప్రవహిస్తోన్న నదిలోకి 50 ఆవులను తోసేసిన ఆకతాయిలు.. 20 ఆవులు మృతి!
cows thrown into swollen river in MP
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 28, 2024 | 5:58 PM

భోపాల్‌, ఆగస్టు 28: ఉధృతంగా ప్రవహిస్తోన్న నదిలో మూగజీవాలను తోసి కొంతమంది ఆకతాయిలు సునకానందం పొందారు. దాదాపు 50 ఆవులను నదిలోకి ఉద్ధేశ పూర్వకంగా తోసేశారు. వీటిల్లో 20 ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో నాగోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (ఆగస్టు 27) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో బామ్‌హోర్‌ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఉన్న సత్నా నదిలోకి నలుగురు ఆకతాయిలు మంగళవారం సాయంత్రం దాదాపు 50 ఆవులను తోలారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బామ్‌హోర్‌ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద నుంచి ఆవులను సాత్నా నదిలోకి తరమడం వీడియోలో కనిపిస్తుంది. బెటా బగ్రి, రవి బగ్రి, రామ్‌పాల్‌ చౌదరీ, రాజ్లు చౌదరీ అనే నలుగురు నిందితులుగా గుర్తించారు. అనంతరం వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నాగోడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అశోక్ పాండే తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చిన వెంటనే, నాగోడ్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 535/24 సెక్షన్ 325, 3(5) ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS), 4/9 MP, గోవధ నిషేధ చట్టం 2004 కింద కేసు నమోదు చేశాం. నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ సత్నా ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి..

ప్రాథమిక సమాచారం ప్రకారం నదిలోకి మొత్తం 50 ఆవులను తోసేసినట్లు తెలుస్తుంది. వాటిల్లో 15- 20 ఆవులు మృతి చెందాయని, మిగిలిన వాటిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుందని ఓ అధికారి తెలిపారు. తదుపరి విచారణ తర్వాత పూర్తి విరాలు వెల్లడిస్తామన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.