AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Mohanlal: సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ దుమ్ముదుమారం.. మోహన్‌లాల్ రాజీనామా!

జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడం వివాదం ముదురుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ నుంచి వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం నిజమేనని తేల్చి చెప్పింది..

Actor Mohanlal: సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ దుమ్ముదుమారం.. మోహన్‌లాల్ రాజీనామా!
Senior Actor Mohanlal
Srilakshmi C
|

Updated on: Aug 27, 2024 | 4:21 PM

Share

జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడం వివాదం ముదురుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ నుంచి వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం నిజమేనని తేల్చి చెప్పింది. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొందరితో సన్నిహితంగా మెలగాలని ముందే చెబుతారని, అందుకు అంగీకరిస్తేనే సినిమాల్స్ ఛాన్స్‌ వస్తుందని పలువురు నటీమణులు తెలిపారు. పైగా ఇందుకు ‘అడ్జస్ట్‌మెంట్స్‌, ‘కాంప్రమైజ్‌’ అనే పదాలు వాడటం మాలీవుడ్‌లో సర్వసాధారణమని ఈ కమిటీ గుర్తించింది. సినీ పరిశ్రమలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడుల నడుమ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

వేదింపుల పరంపరలో నటుడు, రాజకీయ నాయకుడు ముఖేష్‌ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఇక ఇప్పటికే డైరెక్టర్ రంజిత్, నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)కు రాజీనామా చేశారు. తాజాగా AMMA అధ్యక్షుడు మోహన్‌లాల్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ AMMA ఎగ్జిక్యూటివ్‌ కమిటీని రద్దు చేస్తున్నట్లు మోహన్‌లాల్‌ పేర్కొన్నారు. మరో 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించి, కొత్త కమిటీ ఏర్పాటవుతుందని AMMA అసోసియేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

సీనియర్‌ నటుడు సిద్దిఖీ త‌న‌ను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ మ‌ల‌యాళ‌ న‌టి రేవ‌తి సంప‌త్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఆయన కేర‌ళ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. రేవతి సంప‌త్ త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను చేస్తుంద‌ని.. కావాల‌ని త‌న ప‌రువు, మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగిస్తుందని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేర‌ళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక చిత్రనిర్మాత, స్క్రీన్ రైటర్, నటుడు రంజిత్‌ కూడా.. కొద్ది రోజుల క్రితం బెంగాలీ నటి తనపై చేసిన ఆరోపణలకుగానూ తీవ్రంగా స్పందించారు. అయితే హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో కాస్టింగ్‌ కౌచ్‌పై మరికొందరు నటీమణులు మీడియా ముందుకొచ్చి తమ అనుభవాలు పంచుకున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..