AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mulugu: తెలంగాణ గవర్నర్ ములుగు పర్యటనలో అపశ్రతి.. ఏం జరిగిందంటే?

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను..

Mulugu: తెలంగాణ గవర్నర్ ములుగు పర్యటనలో అపశ్రతి.. ఏం జరిగిందంటే?
Governor Jishnudev Varma Tour
Srilakshmi C
|

Updated on: Aug 27, 2024 | 5:02 PM

Share

ములుగు, ఆగస్టు 27: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. అయితే భద్రత నేపథ్యంలో వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ అనే వ్యక్తిని పాము కాటు వేసింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటున కానిస్టేబుల్‌ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు నేడు, రేపు.. వరుసగా రెండు రోజుల పాటు యాదాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ పర్యటనలో ఉన్నారు. పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల సందర్శన అనంతరం లక్నవరం హాలాండ్స్‌లో బస చేస్తారు. గవర్నర్ తొలిసారి పర్యటనకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆగస్టు 27వ తేదీన గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 25 మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహితలతో గవర్నర్‌ పరస్పరం చర్చల అనంతరం.. వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప, గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో బసచేసి మరుసటి రోజు హనుమకొండకు చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..