Thief: చోరీకి వచ్చి ‘బుక్’అయిపోయాడు.. వచ్చిన పని మర్చిపోయి రాత్రంతా ఎంచక్కా పుస్తకం చదువుతూ..
కొంత మందికి పుస్తక పఠనం అంటే అమితాసక్తి. కళ్ల ఎదుట పుస్తకం కనిపిస్తే చదవకుండా ఉండలేరు. ఇక ఫేవరేట్ బుక్ అయితే ఎంత బిజీగా ఉన్న పనంతా పక్కన పెట్టేసి మరీ పుస్తకం ముగించేస్తారు. అయితే ఈ పుస్తక పఠనం ఓ దొంగను ఇరకాటంలో పడేసింది. అదేంటంటే సాధారణంగా దొంగలు రాత్రిళ్లు.. అందరూ నిద్రలోకి జారుకున్నాక.. పిల్లిలా చొరబడి చకచకాల పనికానించి నిమిషాల వ్యవధిలో బయటపడతారు. కొందరు కొంటె దొంగలు..
రోమ్, ఆగస్టు 26: కొంత మందికి పుస్తక పఠనం అంటే అమితాసక్తి. కళ్ల ఎదుట పుస్తకం కనిపిస్తే చదవకుండా ఉండలేరు. ఇక ఫేవరేట్ బుక్ అయితే ఎంత బిజీగా ఉన్న పనంతా పక్కన పెట్టేసి మరీ పుస్తకం ముగించేస్తారు. అయితే ఈ పుస్తక పఠనం ఓ దొంగను ఇరకాటంలో పడేసింది. అదేంటంటే సాధారణంగా దొంగలు రాత్రిళ్లు.. అందరూ నిద్రలోకి జారుకున్నాక.. పిల్లిలా చొరబడి చకచకాల పనికానించి నిమిషాల వ్యవధిలో బయటపడతారు. కొందరు కొంటె దొంగలు ఉంటారు.. వీళ్లు ఇల్లంతా కలియ తిరిగి ఫ్రిజ్‌లో కనిపించిన ఆహారం లాగించేయడం.. లేదంటే చల్లని ఏసీ గదిలో తొంగోవడం.. ఇష్టమైన బ్రాండ్ మందు కనిపిస్తే తాగకుండా ఉండలేకపోవడం.. ప్చ్! ఎవరి వీక్‌నెస్ వాళ్లకు ఉంటుంది. అలాగే ఓ దొంగ గారికి పుస్తకాలంటే యమ పిచ్చి. దొంగతనానికి వెళ్లిన ఇంట్లో ఫేవరెట్ బుక్ కంటపడింది. ఇంకేముంది దాన్ని చదవకుండా ఉండలేకపోయాడు. అంతే చోరీకి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి.. పుస్తకం తెరచి చదవడం ప్రారంభించాడు. అదే కొంపముంచింది. తెల్లగా తెల్లారినా మనోడు పుస్తకంలో నుంచి తలెత్తలేదు. తీరా తలెత్తేసరికి ఎదురుగా పోలీసులు కనిపించారు. దీంతో నేరుగా జైలు కెళ్లాడు. ఈ విచిత్ర ఘటన ఇటలీ రాజధాని రోమ్‌లో చోటు చేసుకుంది.
ఇటలీ రాజధాని రోమ్‌కు చెందిన ఓ ఇంట్లోకి 38 యేళ్ల దొంగ ఓ ఇంట్లోని బాల్కనీ ద్వారా లోపలికి ప్రవేశించాడు. విలువైన వస్తువుల కోసం వెతుకుతుండగా.. టేబుల్‌పై ఓ బుక్ అతడిని అమితంగా ఆకర్షించింది. ఎంతగా అంటే.. చదవకుంటే ప్రాణాలే పోతాయేమోననేంతగా. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారడంతో 71 యేళ్ల యజమాని వచ్చి తడితేగానీ మనోడు ఈ లోకంలోకి రాలేదు. దీంతో షాకైన దొంగ వచ్చిన బాల్కనీలో నుంచే పరారయ్యేందుకు యత్నించాడు. అయితే ఇరుగు పొరుగు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద ఉన్న ఓ బ్యాగ్‌లో డిజైనర్ దుస్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి వచ్చిన అదేరోజు రాత్రి వేరొక ఇంటి నుంచి వాటిని దొంగిలించి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఒక దొంగను అంతగా ఆకర్షించిన ఆ పుస్తకం పేరు ‘ది గాడ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాక్’. ఇది గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకం. ప్రముఖ రచయిత గియోవన్నీ నుచీ దీన్ని రాశారు. ఈ పుస్తకం వల్లనే దొంగ చోరీ చేయకుండా ఉన్నాడని, అందువల్ల జైలుకెళ్లి ఈ పుస్తకం కాపీ ఒకటి అతడికి ఇస్తానని ఇంటి యజమాని మీడియాకు తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.