AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో అసాధ్యుడు.. 2 అడుగుల స్థలంలో ఏకంగా రెండు ఫ్లోర్లు కట్టేశాడు! వీడియో

ఆస్తి పంపకాల్లో దాయాదుల మధ్య తగువులు రావడం షరా మామూలే. భారతం నాటి నుంచే ఈ తరహా తగాదాలు చూస్తున్నాం. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక.. ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం తలలు నరుక్కోవడానికి కూడా వెనకాడరు. అలాగే ఓ కుటుంబం ఆస్తి పంపకాల్లో ఓ వ్యక్తికి రెండంటే రెండు అడుగుల జాగా దొరికినట్లుంది. పట్టుదలతో కట్టాడో.. పౌరుషంతో కట్టాడో తెలియదు గానీ.. అతగాడు ఆ రెండు అడుగుల ఆ భూమిలో ఏకంగా రెండు..

Viral Video: వామ్మో అసాధ్యుడు.. 2 అడుగుల స్థలంలో ఏకంగా రెండు ఫ్లోర్లు కట్టేశాడు! వీడియో
50 Feet House On Two Feet Land
Srilakshmi C
|

Updated on: Aug 26, 2024 | 4:42 PM

Share

ఆస్తి పంపకాల్లో దాయాదుల మధ్య తగువులు రావడం షరా మామూలే. భారతం నాటి నుంచే ఈ తరహా తగాదాలు చూస్తున్నాం. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక.. ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం తలలు నరుక్కోవడానికి కూడా వెనకాడరు. అలాగే ఓ కుటుంబం ఆస్తి పంపకాల్లో ఓ వ్యక్తికి రెండంటే రెండు అడుగుల జాగా దొరికినట్లుంది. పట్టుదలతో కట్టాడో.. పౌరుషంతో కట్టాడో తెలియదు గానీ.. అతగాడు ఆ రెండు అడుగుల భూమిలో ఏకంగా రెండు ఫ్లోర్లు ఇళ్లు కట్టేశాడు. ఇతగాడి వాలకం చూస్తుంటే.. ఉన్నంతలో సర్దుకోవడమంటే ఇదేనని తెలిసొచ్చేలా ఉంది. ఈ విచిత్ర ఇంటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి..

ఇళ్లంటే చాలా మందికి ఓ సెంటిమెంట్‌. అందుకే విశాలమైన స్థలాన్ని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి, ఆచితూచి కలల సౌథాన్ని నిర్మించుకుంటారు. కానీ ఓ వ్యక్తి వృత్తి రిత్యా ఇంజనీర్. అతగాడికి రెండు అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవాటి స్థలం ఉంది. ఇందులో తన ఇంజనీరింగ్‌ తెలివి తేటలన్నీ వాడి రెండంతస్తుల ఇల్లు కట్టాడు! సాధారణంగా ఇంత తక్కువ వెడల్పున్న స్థలంలో ఇళ్లు కట్టడం ఎవరికైనా అసాధ్యంగానే అనిపిస్తుంది. కానీ సదరు ఇంజనీర్ గారు మాత్రం సుసాధ్యం చేయడంతో చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వీడియోను పోస్ట్ చేసిన ఏజెన్సీ ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందినప్పటికీ, ఈ ఇల్లు సరిగ్గా ఎక్కడ ఉందో మాత్రం వీడియోలో స్పష్టంగా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోలో ఇరుకైన రెండు అంతస్తుల ఇల్లు భూమిపై నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 55 మిలియన్ల మంది వీక్షించరంటే ఇంజనీర్‌ తెలివి తేటలకు ముచ్చట పడాల్సిందే. ఇక ఆ వీడియోకు లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది నెటిజన్లు వీడియోను చూసిన అమితాశ్యర్యాలకు గురవుతున్నారు. ఇంజనీర్‌ నైపుణ్యాన్ని పలువురు తెగ పొగిడేస్తుంటే.. మరికొందరేమో.. తాపీ మేస్త్రీ సరిగ్గా జీతం ఇవ్వకపోవడంతో మధ్యలోనే కట్టడం మానేసి వెళ్లిపోయి ఉండొచ్చంటూ జోకులు పేలుస్తున్నారు. ఇంటి వెడల్పు మాత్రం ఒకటిన్నర నుండి రెండు అడుగుల వెడల్పు ఉంటుంది. దాదాపు 50 అడుగుల పొడవుపకప ఆ ఇంట్లో బాల్కనీలు, తలుపులు, కిటికీలు కూడా ఉన్నాయి. కానీ గది పరిమాణం చూసి.. అసలిక్కడ నివసించడం సాధ్యమేనా? అనే అనుమానం రాకమానదు. ఇళ్లు కొట్టినోడికి ఉండటం పెద్ద మ్యాటర్‌ కాదులే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.