Nasal Congestion: ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా? ఈ సింపుల్‌ ట్రిక్‌ ట్రై చేయండి

కాలుష్యం, జీవన శైలి కారణంగా కారణంగా చాలా మంది ఏడాది పొడవునా జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. వర్షంలో ఒకటి రెండు సార్లు తడిసినా జలుబుతో వచ్చే ముక్కు మూసుకుపోవడం ప్రారంభమవుతుంది. ముక్కు మూసుకుపోతే రాత్రతా నిద్ర పట్టదు. దీంతో ఆ మరుసటి రోజంతా చిరాకుగా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఈ సమస్యను వెంటనే తొలగించాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. అవేంటంటే..

Srilakshmi C

|

Updated on: Aug 23, 2024 | 12:53 PM

1 / 5
ఒక గిన్నె లేదా కుండలో వేడినీరు తీసుకుని, అందులో యూకలిప్టస్ లేదా పిప్పరమెంటు నూనె చుక్కలు కొన్ని వేసి తలను టవల్‌తో కప్పి 5-10 నిమిషాలపాటు అవిరి పట్టాలి. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఫ్యాన్‌ను ఆఫ్‌ చేసి ఉంచాలి. ఆవిరి తీసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు ఫ్యాన్ వేసుకోకపోవడమే మంచిది.

2 / 5
జలుబు చేసినప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. అప్పుడే శ్లేష్మం సులభంగా బయటకు వస్తుంది. కాబట్టి అల్లం టీని ఈ సమయంలో తాగవచ్చు. కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె కలుపుకుంటే ఈ టీ ప్రభావం రెట్టింపు అవుతుంది. అలాగే నాసల్ సెలైన్ రిన్సెస్ కూడా వాయు మార్గంలో శ్లేష్మం తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మార్కెట్లో లభించే స్ప్రేని ఇందుకు ఉపయోగించవచ్చు.

3 / 5
జలుబు, దగ్గు కారణంగా ముక్కు మూసుకుపోయినట్లయితే మిరియాలు కలిపిన ఆహారాన్ని తినండి. ఇలా చేస్తే బ్లాక్ అయిన ముక్కు నుంచి ఉపశమనం పొందవచ్చు. పడుకునే ముందు ఒక కప్పు వెచ్చని పాలు లేదంటే నీటిలో పసుపు పొడి, మిరియాల పొడి వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. ఈ ట్రిక్ మూసుకుపోయిన ముక్కులను తక్షణమే తెరుస్తుంది.

4 / 5
నుదిటిపై, ముక్కుపై వెచ్చని కొద్దిగా తడిగా ఉన్న వస్త్రాన్ని ఉంచవచ్చు. ఇది రక్త నాళాలను తెరుస్తుంది. ఇలా చేస్తే కొన్ని నిమిషాల్లో మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం పొందవచ్చు. ముక్కు మూసుకుపోయినట్లయితే నిద్రపోవడం చాలా కష్టం. అయితే తల కింద దిండును కొంచెం ఎత్తులో పెట్టుకుని నిద్రించడానికి ప్రయత్నించవచ్చు. శ్వాస సమస్య కొంత వరకు తగ్గుతుంది. ఫలితంగా మంచి నిద్ర వస్తుంది.

5 / 5
Follow us