- Telugu News Photo Gallery There are many benefits of tying a black thread on the leg, Check Here is Details in Telugu
Black Thread Uses: కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండోయ్…
చిన్న పిల్లలను గమనిస్తే కాళ్లకు, చేతులకు ఖచ్చితంగా నల్ల దారం ఉంటుంది. సాధారణంగా ఈ దారాన్ని దిష్టి తగలకుండా ఉండటం కోసం కట్టకుంటారు. పూర్వం నుంచి ఇప్పటికీ ఇలాగే చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇంకెంత మంది అయితే వెంట్రుకలతో కూడా దారం చేసి కడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే ఈ నల్ల దారాన్ని కట్టుకోవడం చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెడు దృష్టి నుంచి రక్షణ పొందడటం కోసం ఈ నలుపు దారాన్ని కడతారు. ఇలా నల్ల దారం కట్టుకోవడం..
Updated on: Aug 23, 2024 | 12:38 PM

చిన్న పిల్లలను గమనిస్తే కాళ్లకు, చేతులకు ఖచ్చితంగా నల్ల దారం ఉంటుంది. సాధారణంగా ఈ దారాన్ని దిష్టి తగలకుండా ఉండటం కోసం కట్టకుంటారు. పూర్వం నుంచి ఇప్పటికీ ఇలాగే చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇంకెంత మంది అయితే వెంట్రుకలతో కూడా దారం చేసి కడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది ఫ్యాషన్‌గా మారిపోయింది.

అయితే ఈ నల్ల దారాన్ని కట్టుకోవడం చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెడు దృష్టి నుంచి రక్షణ పొందటం కోసం ఈ నలుపు దారాన్ని కడతారు. ఇలా నల్ల దారం కట్టుకోవడం వల్ల హానికరమైన శక్తులు, ప్రతికూల శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది.

అంతే కాకుండా కాలికి నల్ల దారం ధరించడం వల్ల రక్త ప్రసరణపై బ్యాలెన్స్ ప్రభావం చూపుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడతాయి. శరీరంలోని చక్రాలను బ్యాలెన్స్ చేస్తుంది.

నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల చికిత్స చేసేందుకు సులభంగా ఉంటుందని చెబుతారు. అలాగే నల్ల దారం కట్టుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయని, అదృష్టం, సంపదను ఆకర్షిస్తుందని అంటారు.

అంతే కాకుండా ఆర్థిక సమస్యలను కూడా బయట పడతారని నమ్ముతారు. ఉద్యోగం, వ్యాపారంలో నష్టం ఉంటే పాదాలకు నల్ల దారం ధరించడం వల్ల నష్టాలు తొలగిపోతాయి.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.




