- Telugu News Photo Gallery Cinema photos Hero Vijay Thalapathy unveils TVK party flag and focuses on his father political journey Telugu Heroes Photos
Thalapathy Vijay: పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్.! ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా.?
ఓ పని మొదలుపెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిందే.. అదే చేస్తున్నారిప్పుడు విజయ్. ఈయన రాజకీయాల్లోకి వస్తానని చెప్పి చాలా రోజులైంది.. ఇప్పుడొచ్చేసారు. పార్టీ జెండాతో పాటు అజెండాను కూడా ప్రకటించారు. దళపతి స్పీడ్‌తో తమిళనాట రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? మిగిలిన చోట్ల ఏమో కానీ.. తమిళనాడులో మాత్రం రాజకీయాల్ని సినిమా వాళ్లు ఏలేస్తుంటారు.
Updated on: Aug 23, 2024 | 1:11 PM

ఓ పని మొదలుపెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిందే.. అదే చేస్తున్నారిప్పుడు విజయ్. ఈయన రాజకీయాల్లోకి వస్తానని చెప్పి చాలా రోజులైంది.. ఇప్పుడొచ్చేసారు. పార్టీ జెండాతో పాటు అజెండాను కూడా ప్రకటించారు. దళపతి స్పీడ్‌తో తమిళనాట రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

మరి ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? మిగిలిన చోట్ల ఏమో కానీ.. తమిళనాడులో మాత్రం రాజకీయాల్ని సినిమా వాళ్లు ఏలేస్తుంటారు. నాటి ఎంజిఆర్ నుంచి నిన్నమొన్నటి జయలలిత వరకు అంతా సినిమా వాళ్లదే రాజ్యమక్కడ. ఇప్పుడు విజయ్ కూడా అడుగు వేసారు.

ఇదివరకే పార్టీ పేరు ప్రకటించిన దళపతి.. తాజాగా జెండాతో పాటు పార్టీ అజెండాను కూడా జనం ముందుకు తీసుకొచ్చారు. విజయ్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. త్వరలోనే హెచ్ వినోద్ సినిమా మొదలు పెట్టబోతున్నారు.

ఈ రెండు సినిమాల్లోనూ ఏ మాత్రం పొలిటికల్ టచ్ ఉండదని తేల్చేసారు దర్శకులు. రియల్ లైఫ్ రాజకీయాలు చేస్తున్న విజయ్.. రీల్ లైఫ్‌లో మాత్రం నో పాలిటిక్స్ అంటూ దర్శకులకు చెప్తున్నారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో తమిళగ వెట్రి కళగం జెండా ఆవిష్కరించారు విజయ్.

జెండాలో ఎరుపు, పసుపు రంగులతో పాటు రెండు ఏనుగులు, తమిళులు విజయానికి చిహ్నంగా భావించే వాగాయ్ జాతి పువ్వు ఉంది. ఇక గెలిచినా, ఓడినా ఒంటరి ప్రయాణమే అని, తన ఫ్యాన్స్ ఏ పార్టీ జెండాని భుజాన మోయాల్సిన పని లేదని స్పష్టం చేశారు విజయ్.

పార్టీ ప్రకటించినపుడు ఇక సినిమాలు చేయనన్న విజయ్.. గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఫ్యాన్స్‌కు ఆశలు కల్పించారు.

2026 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్న విజయ్.. హెచ్ వినోద్ సినిమాను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. సామాజిక న్యాయమే తన లక్ష్యమని, తమిళనాడు అభివృద్ది కోసం కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు విజయ్.




