AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Tattooed Woman: ‘ఇదేం సోకు తల్లీ.. పిల్లలు చూస్తే దడుసుకుంటారు’ గిన్నీస్‌ రికార్డు కోసం నాలుకను రెండుగా చీల్చి, ఒళ్లంతా..

పుర్రెకో బుద్ధి అని పెద్దలు ఉత్తిగా అన్లేదు. ఇదిగో ఇలాంటి వాళ్లను చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. గిన్నిస్‌ రికార్డ్‌ ఎక్కాలని ఓ యువతి చందమామలాటి రూపాన్ని ఛండాలం చేసుకుంది. ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకుంది. చివరకు కళ్లు, పెదవులు, నాలుకను కూడా వదల్లేదు. ఒంటిపై ఇలా లెక్కలేనన్ని పచ్చబొట్లు వేసుకుని.. చిరరికి అనుకున్నది సాధించింది. ప్రపంచంలోనే అత్యంధిక పచ్చబొట్టు కలిగిన వ్యక్తిగా.

Most Tattooed Woman: 'ఇదేం సోకు తల్లీ.. పిల్లలు చూస్తే దడుసుకుంటారు' గిన్నీస్‌ రికార్డు కోసం నాలుకను రెండుగా చీల్చి, ఒళ్లంతా..
Most Tattooed Woman
Srilakshmi C
|

Updated on: Aug 23, 2024 | 11:05 AM

Share

లండన్‌, ఆగస్టు 23: పుర్రెకో బుద్ధి అని పెద్దలు ఉత్తిగా అన్లేదు. ఇదిగో ఇలాంటి వాళ్లను చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. గిన్నిస్‌ రికార్డ్‌ ఎక్కాలని ఓ యువతి చందమామలాటి రూపాన్ని ఛండాలం చేసుకుంది. ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకుంది. చివరకు కళ్లు, పెదవులు, నాలుకను కూడా వదల్లేదు. ఒంటిపై ఇలా లెక్కలేనన్ని పచ్చబొట్లు వేసుకుని.. చిరరికి అనుకున్నది సాధించింది. ప్రపంచంలోనే అత్యంధిక పచ్చబొట్టు కలిగిన వ్యక్తిగా ఆమె గిన్నీస్‌ రికార్డుకెక్కింది. ఆ కథేంటో చూద్దాంరండి..

అమెరికాకు చెందిన ఎస్పరెన్స్‌ లుమినెస్కా ఫ్యూయెర్‌జినా (36) ఒళ్లంతా పచ్చబొట్లతో గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించింది. దాదాపు 99.98 శాతం శరీరాన్ని ఆమె పచ్చబొట్లతో నింపేసింది. ‘చీకటిని అందంగా మార్చడం’ అనే థీమ్‌తో తన దేహాన్ని కాన్వాస్‌గా మార్చేసుకుంది. బ్రిడ్జ్‌పోర్ట్‌కు చెందిన ఈ మాజీ ఆర్మీ ఉద్యోగిని బాడీ మోడిఫికేషన్ పట్ల తనకున్న అభిరుచిని ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. నా బాడీ ఆర్ట్ ఈ సేకరణ. నేను ఎక్కడికి వెళ్లినా నాతో తీసుకెళ్ళే జ్ఞాపకాలను నేను ఇష్టపడుతున్నాను. నా బాడీ ఆర్ట్‌లో చాలా వరకు నా లైఫ్‌లో జరిగిన సంఘటనలే ఉంటాయి. converting darkness to light గురించి లోతైన అర్థాలు ఈ అర్ట్‌లో దాగి ఉన్నాయని ఆమె వివరించారు. టాటూపై నాకు ఎంత ఇష్టం ఉన్నా ఇదొక బాధాకరమైన అనుభవం. కొన్ని చోట్ల రిస్క్‌ చేసి మరీ వేయించుకున్నాను. నా బాడిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన మోడ్‌లలో ఒకటి స్కారా టాటూయింగ్. ఇది చాలా తీవ్రమైనది. నా నాలుకపై, నోటిలోని చిగుళ్ళపై కూడా టాటూ వేయించుకున్నాను. అందుకు నా నాలుకను రెండుగా చీల్చేసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. తన ఒంటిపై ఇంకా కొన్ని చోట్ల ఖాళీలు ఉన్నాయట. వాటిపై పచ్చబొట్టు వేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నానని చెబుతోంది.

ఇక అందమైన డిజైన్ల పచ్చబొట్లతో శరీరాన్ని నింపేసిన ఈ యువతి అంకిత భావానికి గిన్నిస్‌ రికార్డ్‌ అధికారులు కూడా ఫిదా అయినట్లు ఉన్నారు. ఆమె శ్రమను ప్రశంసిస్తూ ఆమె పేరిట రికార్డును అందించారు. ఈ అరుదైన రికార్డ్‌ తనకు దక్కడంపై కృతజ్ఞతలు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..