AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airport: ఎయిర్‌పోర్టులో కత్తెర మిస్సింగ్‌.. ఏకంగా 36 విమానాలు రద్దు, మరో 200 సర్వీసులు ఆలస్యం

జపాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటైన న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా వాతావరణం అనుకూలించకపోవడం, బాంబ్‌ బెదిరింపు వంటి కారణాలతో విమానాలను రద్దు చేస్తుంటారు. కానీ విచిత్రంగా న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఒక కత్తెర కారణంగా ఏకంగా 30 విమానాలు, 200 సర్వీసులను రద్దయ్యాయి. ఒక కత్తెర కన్పించపోతే ఇన్ని విమానాలు రద్దు చేయడం ఏమిటో..

Airport: ఎయిర్‌పోర్టులో కత్తెర మిస్సింగ్‌.. ఏకంగా 36 విమానాలు రద్దు, మరో 200 సర్వీసులు ఆలస్యం
Flights Candelled Due To Scissor Missing
Srilakshmi C
|

Updated on: Aug 22, 2024 | 9:50 AM

Share

టోక్యో, ఆగస్టు 22: జపాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటైన న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా వాతావరణం అనుకూలించకపోవడం, బాంబ్‌ బెదిరింపు వంటి కారణాలతో విమానాలను రద్దు చేస్తుంటారు. కానీ విచిత్రంగా న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఒక కత్తెర కారణంగా ఏకంగా 30 విమానాలు, 200 సర్వీసులను రద్దయ్యాయి. ఒక కత్తెర కన్పించపోతే ఇన్ని విమానాలు రద్దు చేయడం ఏమిటో అర్ధంకాక ప్రయాణికులంతా అవాక్కయ్యారు. అసలింతకీ ఏం జరిగిందేంటంటే..

జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో గల న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌లో గత శనివారం (ఆగస్టు 17) ఓ రిటైల్‌ స్టోర్‌ నుంచి కత్తెర మిస్సైంది. ఈవిషయాన్ని ఎయిర్‌పోర్ట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల భద్రతా తనిఖీలను పూర్తిగా ఆపివేశారు. అనంతరం దాదాపు రెండు గంటల పాటు దానికోసం తెగ వెతికేశారు. ఈ క్రమంలో మొత్తం 201 విమానాల సర్వీసులు ఆలస్యమయ్యాయి. వీటిల్లో బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నవి 129కాగా.. మరో 72 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా మరో 36 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

కత్తెర కోసం అప్పటికే తనిఖీలు చేసిన ప్రయాణికులను మళ్లీ స్క్రీనింగ్‌ చేయడం ప్రారంభించారు. ఇంతచేసి భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేశామని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పడం కొసమెరుపు. ఉగ్రవాదులెవరైనా ఆ కత్తెరను దొంగలించి దాన్ని ఆయుధంగా చేసుకొనే ప్రమాదం ఉందని, అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. వెరసి ఏకంగా 2 గంటలపాటు ఎయిర్ పోర్టు కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఇంత చేసినా పోయిన కత్తెర మాత్రం ఆ రోజు దొరకలేదు. ఆ మరుసటి రోజు అదే స్టోర్‌లో కనిపించకుండా పోయిన కత్తెర దొరికింది. ఆ స్టోర్‌లో మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు విమానాశ్రయ అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఎయిర్‌పోర్టు జపాన్‌ రవాణా మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించింది. జపాన్‌లోని అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌లలో న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌ ఒకటి. నిత్యం వేలాది ప్రయాణికులతో ఇది చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ ఎంతో కఠినంగా ఉంటాయనడానికి తాజా సంఘటనే నిదర్శనం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.