AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hilarious Video: పంద్రాగస్టులో ఎగరని పావురం.. నెట్టింట ఆకతాయిల జోకులు! క్రమశిక్షణా చర్యలకు ఎస్పీ ఆదేశం

దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆగస్టు 15న గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రతియేట జండా వందన కార్యక్రమాల్లో ప్రేమ, స్వేచ్ఛ, శాంతికి ప్రతీకగా భావించే పావురాలను ఎగురవేయడం పరిపాటి. ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలిలో కూడా పంద్రాగస్టు స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు తమ చేతుల్లోకి పావురాలను తీసుకుని ఎగరవేసేందుకు..

Hilarious Video: పంద్రాగస్టులో ఎగరని పావురం.. నెట్టింట ఆకతాయిల జోకులు! క్రమశిక్షణా చర్యలకు ఎస్పీ ఆదేశం
Pigeon
Srilakshmi C
|

Updated on: Aug 21, 2024 | 11:37 AM

Share

రాయ్‌పుర్‌, ఆగస్టు 21: దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆగస్టు 15న గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రతియేట జండా వందన కార్యక్రమాల్లో ప్రేమ, స్వేచ్ఛ, శాంతికి ప్రతీకగా భావించే పావురాలను ఎగురవేయడం పరిపాటి. ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలిలో కూడా పంద్రాగస్టు స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు తమ చేతుల్లోకి పావురాలను తీసుకుని ఎగరవేసేందుకు యత్నించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అతిధులుగా విచ్చేసిన పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్, బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పున్నూలాల్ మోహ్లే, ముంగేలి కలెక్టర్ రాహుల్.. ఈ ముగ్గురిలో ఇద్దరు ఎగురవేసిన పావురాలు చక్కగా ఎగురుకుంటూ వెళ్లిపోయాయి. కానీ ఎస్సీ గిరిజా శంకర్ జైస్వాల్ ఎగురవేసిన పావురం మాత్రం ఎగరకుండా కుప్పకూలిపోయింది. దీంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఎగరలేని పావురాన్ని తీసుకొచ్చిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘పంచాయత్‌-3’ వెబ్‌సిరీస్‌లోనూ ఇదే తరహా సీన్‌ ఉందంటూ నెటిజన్లు వీడియో క్లిప్పులతో నానా హంగామా చేస్తున్నారు. ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ.. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చూస్తూ కలెక్టర్‌కు లేఖ రాశారు.

వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

‘స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగ సందర్భంగా, పావురం నేలపై పడిన సంఘటన సోషల్ మీడియా, ఇతర మీడియాలో ప్రసారం చేశారు. అనారోగ్యంతో ఉన్న పావురాన్ని ప్రదర్శించడం వల్ల ఇలా జరిగింది. అదే ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అధికారులు సరిగ్గా తమ విధులు నిర్వర్తించకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆగస్టు 20న కలెక్టర్‌కు ఎస్పీ పంపిన లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.