Vinesh Phogat: ‘వినేశ్‌కు రూ.16 కోట్ల క్యాష్‌ ప్రైజ్‌ ఇచ్చారా? అదొక చీప్‌ పబ్లిసిటీ’ వినేశ్‌ ఫొగాట్‌ భర్త క్లారిటీ

పారిస్ ఒలింపిక్స్‌లో మెరిసిన రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ అనూహ్యంగా అనర్హతకు గురై పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందు 100 గ్రాములు అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. ఇక ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చిన వినేశ్‌ ఫొగాట్‌కు అపూర్వ స్వాగతం లభించింది. హరియాణాలోని స్వగ్రామం బలాలికి చేరుకున్న వినేశ్‌కు స్థానికులు లడ్డూలను బహుమతిగా అందించి పండగ..

Vinesh Phogat: 'వినేశ్‌కు రూ.16 కోట్ల క్యాష్‌ ప్రైజ్‌ ఇచ్చారా? అదొక చీప్‌ పబ్లిసిటీ' వినేశ్‌ ఫొగాట్‌ భర్త క్లారిటీ
Vinesh Phogat
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 20, 2024 | 12:28 PM

హర్యాణా, ఆగస్టు 20: పారిస్ ఒలింపిక్స్‌లో మెరిసిన రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ అనూహ్యంగా అనర్హతకు గురై పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందు 100 గ్రాములు అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. ఇక ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చిన వినేశ్‌ ఫొగాట్‌కు అపూర్వ స్వాగతం లభించింది. హరియాణాలోని స్వగ్రామం బలాలికి చేరుకున్న వినేశ్‌కు స్థానికులు లడ్డూలను బహుమతిగా అందించి పండగ చేసుకున్నారు. తమ గ్రామం తరఫున రూ.21 వేలు ప్రైజ్‌మనీని కూడా ఇచ్చారు. అయితే అదొక్కటే కాకుండా ఆమెకు మరికొన్ని సంస్థలు కూడా భారీ మొత్తంలో క్యాష్‌ ప్రైజ్‌ ఇచ్చిటన్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజ‌కీయ పార్టీలు, కొన్ని కంపెనీలు, సంస్థల నుంచి ఆమెకు ఏకగా రూ.16.35 కోట్ల క్యాష్‌ రూపంలో బ‌హుమ‌తిగా అందాయ‌నే పుకార్లు షికార్లు చేశాయి. ఈ కథనాలపై వినేశ్‌ భర్త సోమ్‌వీర్‌ రాథీ ఎక్స్ వేధికగా స్పందిస్తూ అదొక చీప్‌ పబ్లిసిటీ అని కొట్టిపారేశారు.

‘వినేశ్‌ ఫొగాట్‌ ఎలాంటి ప్రైజ్‌మనీని అందుకోలేదు. ఆమెపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం. ఆర్గనైజేషన్లు, బిజినెస్‌మేన్‌, సంస్థలతోపాటు ఇతర పార్టీల నుంచి ఎలాంటి క్యాష్‌ ప్రైజ్‌ రాలేదు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. నిజం చెప్పాలంటే అదొక చీప్‌ పబ్లిసిటీ. శ్రేయోభిలాషులంతా ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. వాటితో మాకు న‌ష్టం వాటిల్లడ‌మే కాకుండా సామాజిక విలువ‌ల‌కు కూడా న‌ష్టమే. ద‌య‌చేసి అలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు హర్యానా ప్రభుత్వం ప్రైజ్ మనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. షూటర్ మను భాకర్ రూ.5 కోట్లు, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రూ.4 కోట్లు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో వినేశ్‌కు భారీ మొత్తంలో ఫ్రైజ్‌ మనీ ముట్టిందని కొందరు కావాలనే ఆమెపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఒలింపిక్ ప‌త‌కం అందిన‌ట్టే అంది చేజారిన బాధ‌లో ఉన్న వినేశ్ అపూర్వ స్వాగ‌తంతో కాస్త కుదుటప‌డినట్లైంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ‘ఒలింపిక్ ప‌త‌కం చేజార్చుకోవ‌డం నా జీవితంలో పెద్ద గాయం. రెజ్లింగ్‌ను వ‌దిలేస్తానా? వీడ్కోలును వాప‌స్ తీసుకుంటానా? అనేది ఇప్పుడే చెప్పలేనని’ వినేశ్ అన్నారు. కాగా ఒలింపిక్స్ ప‌త‌కంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వినేశ్ ఫొగాట్ ఫైన‌ల్ ఫైట్‌కు ముందు కేవలం 100 గ్రాముల అద‌న‌పు బ‌రువుతో ఫైన‌ల్ ఆడ‌లేక‌పోయింది. దీంతో కన్నీటి పర్యాంతమైన వినేశ్‌ రెజ్లింగ్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించింది. వినేశ్ త‌న‌పై వేటు స‌వాల్ చేస్తూ అర్బిట్రేష‌న్ కోర్టు (CAS)లో అప్పీల్ చేసినా ఫలితం లేకపోయింది. మూడు సార్లు తీర్పును వాయిదా వేసిన కాస్ చివ‌ర‌కు ప‌త‌కం ఇవ్వలేమ‌ని తేల్చి చెప్పింది. యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్‌ ఆర్టికల్ 7 ప్రకారం నిర్ణీత బరువు బాధ్యత రెజ్లర్‌పైనే ఉంటుందని తీర్పు సందర్భంగా కాస్‌ వ్యాఖ్యానించింది.

మరిన్ని క్రీడా కథనాల కోసం క్లిక్‌ చేయండి.