Video: ఎవడు సామీ వీడు.. ఒకే ఓవర్లో 39 పరుగులు.. యువరాజ్ రికార్డ్‌ ఊడ్చేశాడుగా.. వైరల్ వీడియో

Darius Visser: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు వచ్చి చేరింది. అది కూడా ఒకే ఓవర్లో 39 పరుగులు చేయడం విశేషం. సమోవన్ జట్టు తుపాన్ స్ట్రైకర్ డారియస్ విస్సర్ ఓ ప్రత్యేక రికార్డును లిఖించాడు. ఈ రికార్డుతో యువరాజ్ సింగ్‌ను టాప్ లిస్టులో లేకుండా చేశాడు.

Video: ఎవడు సామీ వీడు.. ఒకే ఓవర్లో 39 పరుగులు.. యువరాజ్ రికార్డ్‌ ఊడ్చేశాడుగా.. వైరల్ వీడియో
Samoa's Darius Visser
Follow us

|

Updated on: Aug 20, 2024 | 1:57 PM

Darius Visser: ఐసీసీ టీ20 ప్రపంచకప్ తూర్పు ఆసియా-పసిఫిక్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో సమోవా ఆటగాడు డారియస్ విస్సర్ ఒకే ఓవర్‌లో 39 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే యువరాజ్ సింగ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. అపియాస్ గార్డెన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సమోవా, వనాటు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సమోవా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన సమోవాకు శుభారంభం లభించలేదు. కేవలం 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో డారియస్ విస్సర్ రంగంలోకి దిగి మ్యాచ్ మొత్తం మ్యాచ్‌ని మార్చేశాడు. ఆరంభం నుంచే తుఫాన్ బ్యాటింగ్ కనబర్చిన డారియస్ వనాటు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా నలిన్ నిపికో 15వ ఓవర్లో 39 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు.

ఈ ఓవర్ తొలి మూడు బంతుల్లో డారియస్ విస్సర్ మూడు సిక్స్‌లు బాదాడు. 4వ బంతికి నో బాల్, భారీ సిక్స్ బాదాడు. మళ్లీ బంతిపై మరో సిక్స్. 5వ బంతికి పరుగు లేదు. 6వ బంతికి నో బాల్, మరో సిక్స్ వచ్చింది. నో బాల్‌ని మళ్లీ డెలివరీ చేశాడు. చివరి బంతికి భారీ సిక్సర్. దీని ద్వారా డారియస్ విస్సర్ మొత్తం 39 పరుగులు సాధించాడు.

సిక్సర్ల వీడియో..

View this post on Instagram

A post shared by ICC (@icc)

దీంతో పాటు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డారియస్ విస్సర్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2007 T20 ప్రపంచ కప్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు చేశాడు. ఇప్పుడు డారియస్ విస్సర్ 39 పరుగులతో కొత్త చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో 62 బంతులు ఎదుర్కొన్న డారియస్ విస్సర్ 14 సిక్స్‌లు, 5 ఫోర్లతో 132 పరుగులు చేశాడు. దీంతో సమోవన్ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వనాటు ఓపెనర్ నలిన్ నిపికో 73 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లోకి దిగిన జాషువా రాసు 23 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో 164 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..