Viral Video: ‘దేవుడే ఆ చిన్నారిని కాపాడాడు..’ రన్నింగ్‌ బైక్‌పై చిన్నారి.. డ్రైవర్‌ లేకుండానే అర కి.మీ ప్రయాణం

పిల్లలు దేవుడితో సమానం అంటారు.. ఈ వీడియో చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. బిజీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ బైక్‌పై నుంచి కింద పడిపోతే.. అదే బైక్‌పై ఉన్న చిన్నారి మాత్రం ఎవరో పట్టుకున్నట్లు బైక్‌పై అలాగే కూర్చుంది. ఇక బైక్‌ కూడా ఎవరో నడుపుతున్నట్లు తొనక్కుండా బెనక్కుండా ఎవరూ డ్రైవ్‌ చేయకుండానే రోడ్డుపై ఇతర ఏ వాహనాలను ఢీ కొట్టకుండా చాలా దూరం వెళ్లింది. అలా వెళ్లిన బైక్‌ రోడ్డు పక్కన..

Viral Video: 'దేవుడే ఆ చిన్నారిని కాపాడాడు..' రన్నింగ్‌ బైక్‌పై చిన్నారి.. డ్రైవర్‌ లేకుండానే అర కి.మీ ప్రయాణం
Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 22, 2024 | 10:42 AM

పిల్లలు దేవుడితో సమానం అంటారు.. ఈ వీడియో చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. బిజీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ బైక్‌పై నుంచి కింద పడిపోతే.. అదే బైక్‌పై ఉన్న చిన్నారి మాత్రం ఎవరో పట్టుకున్నట్లు బైక్‌పై అలాగే కూర్చుంది. ఇక బైక్‌ కూడా ఎవరో నడుపుతున్నట్లు తొనక్కుండా బెనక్కుండా ఎవరూ డ్రైవ్‌ చేయకుండానే రోడ్డుపై ఇతర ఏ వాహనాలను ఢీ కొట్టకుండా చాలా దూరం వెళ్లింది. అలా వెళ్లిన బైక్‌ రోడ్డు పక్కన ఉన్న చెట్ట పొదను ఢీ కొట్టడంతో చిన్నారి సురక్షితంగా ఫుట్‌పాత్ గడ్డిపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ వీడియో చూసేయండి..

ఈ వీడియోలో బిజీ రోడ్డుపై భార్య బిడ్డలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి కలినిపిస్తాడు. అదే రోడ్డుపై ఇతర వాహానాలు కూడా యమ స్పీడ్‌లో వెళ్తుంటాయి. ఇంతలో బైకుకు అనుకోని ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న మరో బైకును బలంగా ఢీ కొట్టడంతో.. దానిపై కూర్చున్న దంపతులు ఇద్దరూ కింద పడిపోయి.. కొంతదూరం దొర్లుకుంటూ వెళ్తారు. కానీ బైక్‌పై కూర్చున్న చిన్నారి మాత్రం తన సీట్లో అలాగే కూర్చుని ఉండటం వీడియోలో చూడొచ్చు. అంత ప్రమాదం జరిగితే బైక్‌ కింద పడలేదు సరికదా.. రోడ్డుపై వెళ్తున్న ఏ వాహనాన్ని కూడా ఢీ కొట్టలేదు. అలా రోడ్డుపై నేరుగా వెళ్తున్న బైక్‌ను చూసి.. రోడ్డుపై ఇతర వాహనాల్లోని ప్రయాణికుల ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. అలా ఏకంగా 500 మీటర్ల వరకు వెళ్లిన బైక్‌ రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదలకు ఢీ కొనడంతో చిన్నారి గడ్డిపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారికి ఎలాంటి గాయాలు తగలకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

అనంతరం కొందరు వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని ఎత్తుకుని పోలీసులకు సమాచారం అందించారు. బైక్‌ని మరో వాహనాన్ని ఢీకొట్టి ఉంటే చిన్నారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింతో తెలియదు గానీ ఇందుకు సంబంధించిన దృశ్యాలు అదే రోడ్డుపై వెళ్తున్న మరో కారులోని కెమెరాలో రికార్డయ్యాయి. దీనిని HasnaZarooriHai అనే యూజర్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. బైక్‌ అతివేగంతో వెళ్లడం వల్లే రైడర్‌ అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో