AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారత్‌ బంద్‌లో నిరసనకారుల అత్యుత్సాహం.. పిల్లలతో వెళ్తున్న స్కూల్‌ బస్సుకి మంటలు? వీడియో

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆసస్టు 21వ తేదీన దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దళిత, ఆదివాసీ సంఘాలు బుధవారం దేశ వ్యాప్తంగా దాదాపు ప్రశాంతంగానే బంద్‌ జరిగింది. అయితే గిరిజనుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో నిరసనలు ఎక్కువగా కనిపించాయి. ముఖ్యంగా బిహార్‌లో బంద్‌ ప్రభావం కాస్త..

Viral Video: భారత్‌ బంద్‌లో నిరసనకారుల అత్యుత్సాహం.. పిల్లలతో వెళ్తున్న స్కూల్‌ బస్సుకి మంటలు? వీడియో
Bihar School Bus Tyre Burning
Srilakshmi C
|

Updated on: Aug 22, 2024 | 1:37 PM

Share

బీహార్‌, ఆగస్టు 22: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆసస్టు 21వ తేదీన దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దళిత, ఆదివాసీ సంఘాలు బుధవారం దేశ వ్యాప్తంగా దాదాపు ప్రశాంతంగానే బంద్‌ జరిగింది. అయితే గిరిజనుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో నిరసనలు ఎక్కువగా కనిపించాయి. ముఖ్యంగా బిహార్‌లో బంద్‌ ప్రభావం కాస్త ఎక్కువగా కనిపించింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో పిల్లలతో వెళ్తున్న పాఠశాల బస్సును భారత్ బంద్ నిరసనకారులు అడ్డుకున్నారు. బస్సు వెళ్లకుండా రోడ్డుపై బస్సును నిలిపి వేయడంతో.. కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉంది. అయితే కొందరు నిరసనకారులు బస్సు కింద ఉన్న టైర్లకు నిప్పంటించారు. దీంతో బస్సు కింద మంటలు చెలరేగాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న బస్సులోని పిల్లలకు ఊహించని ప్రమాదం జరిగేది. సకాలంలో పోలీసులు, జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దళిత, ఆదివాసీ సంఘాల పిలుపుమేరకు భారత్ బంద్‌లో భాగంగా ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో నిరసన కారులు గుమిగూడారు. ఈ వీడియోలో పసుపు రంగు బస్సును కర్రలతో ఆయుధాలు ధరించిన గుంపు చుట్టుముట్టడం కనిపిస్తుంది. అనంతరం ఓ వ్యక్తి బస్సు కింద టైర్లకు నిప్పుపెట్టడం కనిపిస్తుంది. అయితే నిరసనకారులు బస్సుపై దాడి చేసి తగులబెట్టేందుకు ప్రయత్నించారని పలువురు ఆరోపించారు. అక్కడే ఉన్న పోలీసులు దీనిపై వివరణ ఇచ్చారు. నిరసనకారులు టైర్లను తగులబెట్టి రహదారిని దిగ్బంధించడానికి యత్నించారే తప్ప, వారు బస్సును తగలబెట్టే ప్రయత్నం చేయలేదని గోపాల్‌గంజ్ పోలీసులు స్పష్టం చేశారు. రోడ్డుపై టైర్లను తగటబెట్టినప్పుడు.. బస్సు టైరు మంటల మీదగా వెళ్లినట్లు తెలిపారు. కానీ ఈ చర్య వల్ల బస్సుకు మంటలు అంటుకుని ఉంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో  చూడండి..

ఇవి కూడా చదవండి

అదే ప్రాంతంలో ఓ మహిళ బైక్‌పై వెళ్తుండగా.. నరసనకారులు ఆమె బైక్‌ను అడ్డుకున్నారు. ఇదే మాదిరి జాతీయ రహదారి 27, రైల్వే ట్రాక్‌ల వెంబడి నిరసనకారులు వాహనాలకు అంతరాయం కలిగించారు. దీనిపై గోపాల్ గంజ్ పోలీసు సూపరింటెండెంట్ స్వర్ణ్ ప్రభాత్ మాట్లాడుతూ.. భారత్ బంద్ కారణంగా హై అలర్ట్ ప్రకటించామని అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మోహరించినట్లు తెలిపారు. గోపాల్‌గంజ్ ప్రాంతంలో భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన వచ్చిందని, కొన్ని రోడ్లపై వాహనాలు సాఫీగా ప్రయాణించాయని అన్నారు. కాగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఉప వర్గీకరణలు చేయవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.