AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: బంగ్లాదేశ్‌లో వరదలకు అది కారణం కాదు.. అసలు విషయం ఏంటంటే..

భారత్‌తో పాటు బంగ్లాదేశ్ గుండా ప్రవహించే గుమ్టి (గోమతి) నది పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయని ఇందులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో వరదలకు ఆనకట్ట దిగువన ఉన్న ఈ పెద్ద పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చిన జలాల ను ప్రధాన కారణంగా చెబుతున్నారు. డుంబుర్‌ ఆనకట్ట సరిహద్దు నుంచి చాలా సుమారు 128 కి.మీల దూరంలో ఉంది...

Bangladesh: బంగ్లాదేశ్‌లో వరదలకు అది కారణం కాదు.. అసలు విషయం ఏంటంటే..
Bangladesh
Narender Vaitla
|

Updated on: Aug 22, 2024 | 11:43 AM

Share

త్రిపురలోని గుమ్టి నదికి ఎగువున ఉన్న డుంబూర్‌ డ్యామ్‌ను తెరవడం వల్లే బంగ్లాదేశ్‌ తూర్పు సరిహద్దు జిల్లాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయని బంగ్లాదేశ్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. బంగ్లాదేశ్‌ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

భారత్‌తో పాటు బంగ్లాదేశ్ గుండా ప్రవహించే గుమ్టి (గోమతి) నది పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయని ఇందులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో వరదలకు ఆనకట్ట దిగువన ఉన్న ఈ పెద్ద పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చిన జలాల ను ప్రధాన కారణంగా చెబుతున్నారు. డుంబుర్‌ ఆనకట్ట సరిహద్దు నుంచి చాలా సుమారు 128 కి.మీల దూరంలో ఉంది. దీని ఎత్తు ఎత్తు (సుమారు 30 మీ) డ్యామ్, ఇది ఒక గ్రిడ్‌లోకి ఫీడ్ అయ్యే శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బంగ్లాదేశ్‌కి కూడా త్రిపుర నుంచి 40 మెగావాట్స్‌ విద్యుత్‌ లభిస్తుంది. అమర్‌పూర్‌, సానామురా, సోనామురా 2 వద్ద మూడు నిటీ మట్టాల పరిశీల కేంద్రాలు ఉన్నాయి.

కాగా త్రిపురతో పాటు బంగ్లాదేశ్‌లోని చుట్టుపక్కల జిల్లాల్లో ఆగస్టు 21వ తేదీ నుంచి భారీ వర్షపాతం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో భారీగా పెరిగిన నేపథ్‌యంలో గేట్లు ఆటోమెటిక్‌గా విడుదలయ్యాయి. అమర్‌పూర్ స్టేషన్ ద్వైపాక్షిక ప్రోటోకాల్‌లో భాగంగా ఉంది. 21వ తేదీ 3 గంటల వరకు బంగ్లాదేశ్‌కు పెరుగుతున్న నీటి ప్రవాహానికి సంబంధించిన డేటాను అందించాము. 6 గంటల సమయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో కమ్యూనికేషన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయినా ఇతర మార్గాల ద్వారా అత్యవసర సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశాము.

భారతదేశం, బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న నదులపై వరదలు రెండు వైపుల ప్రజలకు బాధలను కలిగించే ఉమ్మడి సమస్. వాటిని పరిష్కరించడంలో పరస్పర సహకారం అవసరం ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. రెండు దేశాలు 54 ఉమ్మడి సరిహద్దు నదులను పంచుకుంటున్నందున, నదీ జలాల సహకారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద్వైపాక్షిక సంప్రదింపులు, చర్చల ద్వారా నీటి వనరులతో పాటు నదీ జలాల నిర్వహణలో సమస్యలు పరిష్కారాని తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..