Viral Video: ధైర్యం అంటే ఇలా ఉండాలి.. భారీ సర్పానికి చుక్కలు చూపించిన యువతి! వీడియో

పొరబాటున ఎక్కడైనా పాము కనిపిస్తే.. వెనక్కి చూడకుండా లగెత్తేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు. అయితే ఓ యువతి మాత్రం పామును చూడటమే కాదు.. ఒట్టి చేతుల్లో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సారి యువతిని చూసి పామే భయంతో పారిపోయేందుకు తెగ లబలబలాడిపోయింది..

Viral Video: ధైర్యం అంటే ఇలా ఉండాలి.. భారీ సర్పానికి చుక్కలు చూపించిన యువతి! వీడియో
Girl Tries To Catch Python
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2024 | 9:49 AM

పొరబాటున ఎక్కడైనా పాము కనిపిస్తే.. వెనక్కి చూడకుండా లగెత్తేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు. అయితే ఓ యువతి మాత్రం పామును చూడటమే కాదు.. ఒట్టి చేతుల్లో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సారి యువతిని చూసి పామే భయంతో పారిపోయేందుకు తెగ లబలబలాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పొలాల్లో పాములు కనిపించడం షరా మామూలే. ఈ వీడియోలో కూడా నీటితో నిండిన బురద పొలంలో ఓ యువతి జీన్స్‌ ధరించి నిలబడి ఉండటం కనిపిస్తుంది. అనంతరం ఆమె వంగి బురదలో నుంచి ఏదో పొడవాటి ఆకారాన్ని బయటకు తీయడం కనిపిస్తుంది. పొలాల్లో అప్పుడప్పుడు చేపలు, పీతలు కూడా వస్తుంటాయి కదా.. అలాగే ఇది కూడా పెద్ద సైజు చేప అనుకుంటే పొరబాటే. అదొక భారీ కొండ చిలువ. యువతి కొండ చిలువ తోక పట్టుకోవడంతో అది భయంతో జరజరా పాకుతూ పారిపోవడం వీడియోలో చూడొచ్చు.

అయితే ఏ మాత్రం తగ్గేదే లే.. అంటూ యువతి మాత్రం దాన్ని పట్టుకునేందుకు దాని వెంట పడి మళ్లీ పట్టుకుంటుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన పాము యువతిని కరిచేందుకు వెనక్కి తిరిగి దాచి చేసేందుకు దూకింది కూడా. అయితే యువతి క్షణాల్లో వెనక్కి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. అయితే ఆమె మాత్రం చేతులతో పామును పట్టుకునేందుకు బురదలో దాని వెంట పడుతుంది. ఈ క్రమంలో పలుమార్లు పామును పట్టుకోవడం.. ఆదేమో జారి పోవడం వీడియో కనిపిస్తుంది. ప్రమాదాన్ని పసిగట్టిన కొండచిలువ వేగం పెంచి పొలం గట్టు దాటి ఠంఛన్‌గా పారిపోయింది. ఇలా సదరు యువతి ఎంత ప్రయత్నించినా కొండచిలువను పట్టుకోలేకపోయింది

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Arti Yadav (@aartiyadav7082)

ఆర్తి యాదవ్ అనే యూజర్‌ ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వీడయో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్ల వ్యూస్, లక్షల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక యువతి ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రతి ఒక్కరికీ లైఫ్‌ ఈ స్థాయి కాన్ఫిడెన్స్‌ అవసరమని ఒక యూజర్ కామెంట్‌ చేయగా.., మరికొందరు యువతి ధైర్యసాహసాలను ప్రశంసించారు. పొలాల్లో పని చేస్తూ జీవనోపాధి పొందే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఎదుర్కొంటున్న సవాళ్లను వీడియో హైలైట్ చేస్తుంది. ప్రమాదకరమైన వన్యప్రాణులతో జాగ్రత్తగా ఉండాల, ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త, సంసిద్ధత చాలా అవసరమని పలువురు కామెంట్ సెక్షన్‌లో చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.