Viral News: పురుషుల శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉచిత సలహా చెప్పింది.. యాంకర్ జాబ్ పోగొట్టుకొంది.. ఎక్కడంటే
ఆగస్టు 8 న తన వ్యక్తిగత సోషల్ మీడియా పేజీలో ఓ పోస్ట్ చేసి.. అందులో వేసవి కాలంలో కొంతమంది పురుషుల శరీరం నుంచి అధిక దుర్వాసన వస్తుందని పేర్కొంది. అలా దుర్వాసన వచ్చే పురుషులు రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేయాలని, డియోడరెంట్‌ని ఉపయోగించమని కూడా ఉచిత సలహా ఇచ్చింది. అంతేకాదు తనను తాను తాజాగా ఉంచుకోవడానికి వైప్స్, ఫేర్ప్యుమ్స్ లను కూడా ఉపయోగిస్తానని ఆమె రాసింది.
జపాన్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మగవారి శరీరం నుంచి దుర్వాసన వస్తుందని సోషల్ మీడియాలో మాట్లాడినందుకు ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించారు. నివేదిక ప్రకారం పోస్ట్ వైరల్ అయిన తర్వాత 29 ఏళ్ల యూరి కవాగుచి పై సర్వత్రా విమర్శలు వినిపించాయి. యూరీ టోక్యోకు చెందిన ఓ టీవీ ఛానెల్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తోంది.
పురుషుల చెమట వాసన గురించి మాట్లాడుతూ యూరి తన నిరాశను వ్యక్తం చేసింది. ఆగస్టు 8 న తన వ్యక్తిగత సోషల్ మీడియా పేజీలో ఓ పోస్ట్ చేసి.. అందులో వేసవి కాలంలో కొంతమంది పురుషుల శరీరం నుంచి అధిక దుర్వాసన వస్తుందని పేర్కొంది. అలా దుర్వాసన వచ్చే పురుషులు రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేయాలని, డియోడరెంట్‌ని ఉపయోగించమని కూడా ఉచిత సలహా ఇచ్చింది. అంతేకాదు తనను తాను తాజాగా ఉంచుకోవడానికి వైప్స్, ఫేర్ప్యుమ్స్ లను కూడా ఉపయోగిస్తానని ఆమె రాసింది. తను చేసే విధంగా పురుషులు కూడా అదే చేయాలని సూచించింది.
అయితే అమ్మడి ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత యూరి కవాగుచి అనేక విమర్శలు ఎదుర్కోంది. యూరి లింగం ఆధారంగా వివక్ష చూపుతోందని అనవసరంగా పురుషులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతోందని ఆరోపించారు. ఈ సమస్య కేవలం మగవారికే పరిమితం కాదనీ దీన్ని ఏదైనా ప్రత్యేక జెండర్ కు ముడిపెట్టడం సరికాదని విమర్శించారు.
పురుషులను మాత్రమే నిందించటం తప్పు అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. వృద్ధ స్త్రీల శరీరం నుంచి కూడా చెడు వాసన వస్తుందని.. ఈ విషయంలో తాను కూడా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నానని అయినా ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని కామెంట్ చేశారు. వివాదం పెరుగుతున్న నేపధ్యంలో యూరి తన పోస్ట్‌ను తొలగించింది. అయితే అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. యూరీని బహిరంగంగా క్షమాపణలు చెప్పమంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు యూరీ పనిచేస్తున్న మీడియా సంస్థ కూడా ఉద్యోగం నుండి తొలగించింది.
Announcer Kawaguchi Yuri’s agency fired her after she said that men stink (literally). On X, she bemoaned the odor men give off during the summer and asked them “at the very least” to shower & use deodorant daily. (Kawaguchi has obviously been to an anime convention in August.) pic.twitter.com/Im7rb3uqkl
— Unseen Japan (@UnseenJapanSite) August 11, 2024
యాంకర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది
దీంతో యూరీ ట్వీట్ చేస్తూ క్షమాపణలు చెప్పింది. తన అజాగ్రత్త వ్యాఖ్యల వల్ల చాలా మంది బాధపడినందుకు చాలా చింతిస్తున్నాను. ఇక నుంచి ఎవరినీ నొప్పించేలా మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని తనను మనస్పూర్తిగా క్షమించమని కోరింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..