Andhra Pradesh: ఏపీలో ‘హైడ్రా’ ప్రకంపనలు.. ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయాలంటూ చంద్రబాబు సర్కార్ మాస్ వార్నింగ్
హైడ్రా ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా షేక్ చేస్తున్నాయి... ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలు.. ఏవైనా కావొచ్చు.. ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయండి. లేదంటే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం వార్నింగ్ ఇస్తోంది.
హైదరాబాద్‌లో హైడ్రా హడలెత్తిస్తోంది.. అక్రమ కట్టడాల అంతుచూస్తోంది.. సామాన్యుడైనా, వీఐపీ అయినా… అందరికి ఒకే రూల్ అంటూ దూసుకెళ్తోంది.. ప్రజాప్రతినిధులైనా, రాజకీయ ప్రముఖులైనా, సెలబ్రిటీలైనా.. ఆక్రమణలు అని తేలితే నేలమట్టం చేసుడే.. ఇలా హైడ్రా.. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సంచలనంగా మారింది.. ఈ హైడ్రా ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా షేక్ చేస్తున్నాయి… ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలు.. ఏవైనా కావొచ్చు.. ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయండి. లేదంటే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం వార్నింగ్ ఇస్తోంది. మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చంధంగా ఇచ్చేయాలని మునిసిపల్ శాఖమంత్రి నారాయణ హెచ్చరించారు. లేదంటే ప్రభుత్వమే లాక్కుంటుందని స్పష్టం చేశారు. విశాఖ కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ నిర్వహణ, సాలీడ్ వెస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ పనితీరు పరిశీలించిన నారాయణ.. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. ప్రధానంగా మున్సిపల్ శాఖ అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఆక్రమణలపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణదారులు కబ్జా చేసిన చేసిన స్థలాలు తిరిగి ఇవ్వకుంటే.. హైడ్రా తరహా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.. అక్రమార్కులు దారికి రాకుంటే హైడ్రా తరహా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాగా.. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలతో ప్రకంపనలు పుట్టిస్తోంది. అటు ఏపీలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తోంది. ఆక్రమణల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. అక్రమార్కులు ముందే మేల్కొని ఆక్రమించిన స్థలాలను తిరిగి ఇచ్చేయాలని సూచిస్తోంది. ఈ హెచ్చరికలతో ఆక్రమణదారులు దారికొస్తారా? లేదంటే బుల్డోజర్ల దాకా పరిస్థితి తెచ్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది.. ఏదిఏమైనప్పటికీ.. హైడ్రా తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారడం గమనార్హం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..