Explainer: విశాఖలో సముద్రం ఎందుకు వెనక్కు వెళ్లింది ??

Explainer: విశాఖలో సముద్రం ఎందుకు వెనక్కు వెళ్లింది ??

Phani CH

|

Updated on: Aug 27, 2024 | 4:42 PM

సముద్రం దగ్గరకు మనం వెళ్తే అలలు మన మీదకు దూకుతాయి....అదే సముద్రమే వెనక్కి వెళ్తే? సముద్రం ఉన్నట్టుండి.. వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖపట్నం వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. జపాన్‌లో భారీ భూకంపం ప్రభావమో, లేక రెగ్యులర్ అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో.. తెలియదు గానీ, విశాఖలో మూడు, నాలుగు రోజులు నుంచి సముద్రం కాస్త వెనకకు వెళ్ళింది.

సముద్రం దగ్గరకు మనం వెళ్తే అలలు మన మీదకు దూకుతాయి….అదే సముద్రమే వెనక్కి వెళ్తే? సముద్రం ఉన్నట్టుండి.. వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖపట్నం వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. జపాన్‌లో భారీ భూకంపం ప్రభావమో, లేక రెగ్యులర్ అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో.. తెలియదు గానీ, విశాఖలో మూడు, నాలుగు రోజులు నుంచి సముద్రం కాస్త వెనకకు వెళ్ళింది. దీంతో వైజాగ్ లో అలజడి రేగింది. ఎక్కడో జపాన్‌లో భూకంపం వస్తే అంత దూరం వెళ్తుందా? అసలు కారణం అదేనా? వేరే ఏమైనా కారణాలా? అన్న అనుమానాలు తలెత్తున్నాయి. తీరం నుంచి దాదాపు 100 అడుగుల మేర సముద్రం వెనక్కి తగ్గింది. గత మూడు, నాలుగు రోజులుగా ఇలాగే జరుగుతోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో తీరానికి దగ్గర్లో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 2న ఆర్కే బీచ్ దగ్గర సుమారు 100 అడుగుల దూరం సముద్రం వెనక్కివెళ్లింది. ఈ నెల 4న కూడా కూడా సముద్రం వెనక్కివెళ్లింది. తాజాగా 100 అడుగులు వెనక్కి వెళ్లడంతో చెత్తాచెదారం తీరానికి కొట్టుకొచ్చింది. అయితే, జపాన్ లో భూకంపమా? లేక ఆటు పోటు నా? అన్న దానిపై ఎవరి విశ్లేషణలు వాళ్లు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్నూలులో మళ్లీ వజ్రం దొరికింది.. ఆ రైతు కష్టాలన్నీ తీర్చింది

బిర్యానీ తిందామని హోటల్‌కు వెళ్లిన కస్టమర్స్‌.. ఒక్కసారిగా పరుగులు

భర్త బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న భార్య.. ఎందుకంటే ??

జ్వరం, జలుబు, ఎలర్జీకి వాడే మందుల్లో కొన్నింటిపై నిషేధం

ఆటో పే ఆప్షన్ తో పెరుగుతున్న సైబర్ మోసాలు