కర్నూలులో మళ్లీ వజ్రం దొరికింది.. ఆ రైతు కష్టాలన్నీ తీర్చింది
కర్నూలు జిల్లాలో మరో రైతును అదృష్టం వరించింది. చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరికింది. అయితే జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది.. ఈ క్రమంలో వజ్రాలు దొరుకుతున్నాయి. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన బోయి రామాంజనేయులుకు ఓ రాయి దొరికింది. వెంటనే దానిని తీసుకొని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి వద్దకు పరుగెత్తాడు.
కర్నూలు జిల్లాలో మరో రైతును అదృష్టం వరించింది. చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరికింది. అయితే జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది.. ఈ క్రమంలో వజ్రాలు దొరుకుతున్నాయి. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన బోయి రామాంజనేయులుకు ఓ రాయి దొరికింది. వెంటనే దానిని తీసుకొని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి వద్దకు పరుగెత్తాడు. అది వజ్రమేనని తేల్చిన వ్యాపారి రైతుకు 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. రైతు అదృష్టానికి ఎంతో సంతోషించాడు. చిన్నప్పటినుంచి కష్టాలనే చూసిన రామాంజనేయులు ఈ వజ్రం తన కష్టాలన్నీ తీర్చుతుందని ఆనందం వ్యక్తం చేశాడు. రామాంజనేయులు బోయ, శేఖర్ అన్నదమ్ములు. వీరికి రెండు ఎకరాల పొలం ఉంది. అదే సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలో పనుల్లేనప్పుడు డ్రైవర్లుగా పనిచేసుకుని బ్రతుకుతారు. ఎప్పటిలాగే ఉదయం పొలం పనులకు వెళ్లిన రామాంజనేయులుకు వజ్రం దొరికింది. రాత్రికి రాత్రి అతన్ని లక్షాధికారిని చేసింది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు రావడంతో దాదాపుగా ఇప్పటి వరకు 42 వజ్రాలు లభ్యమయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిర్యానీ తిందామని హోటల్‌కు వెళ్లిన కస్టమర్స్.. ఒక్కసారిగా పరుగులు
భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య.. ఎందుకంటే ??
జ్వరం, జలుబు, ఎలర్జీకి వాడే మందుల్లో కొన్నింటిపై నిషేధం
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

