బిర్యానీ తిందామని హోటల్‌కు వెళ్లిన కస్టమర్స్.. ఒక్కసారిగా పరుగులు
మిట్ట మధ్యాహ్నం వేళ..కడుపులో నకనకలాడే కస్టమర్లు రుచికరమైన బిర్యానిని కడుపారా ఆరగిద్దామని భావించారు. బిల్లు చెల్లించి బిర్యాని కోసం ఎదురు చూడసాగారు. కాసేపటికి వేడి వేడి బిర్యానిని సర్వర్లు తెచ్చి ప్లేట్లల్లో వడ్డించారు. ఇష్టమైన బిర్యానీని తినే టైమ్ కు ఒక్కసారిగా హోటల్ భవనానికి మంటలు అంటుకున్నాయి. సెల్లార్ లోని జనరేటర్ నుంచి వచ్చిన మంటలు క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బిర్యాని భోజనాలు వదిలి ఎటు వాళ్ళు అటు పరుగెత్తారు.
మిట్ట మధ్యాహ్నం వేళ..కడుపులో నకనకలాడే కస్టమర్లు రుచికరమైన బిర్యానిని కడుపారా ఆరగిద్దామని భావించారు. బిల్లు చెల్లించి బిర్యాని కోసం ఎదురు చూడసాగారు. కాసేపటికి వేడి వేడి బిర్యానిని సర్వర్లు తెచ్చి ప్లేట్లల్లో వడ్డించారు. ఇష్టమైన బిర్యానీని తినే టైమ్ కు ఒక్కసారిగా హోటల్ భవనానికి మంటలు అంటుకున్నాయి. సెల్లార్ లోని జనరేటర్ నుంచి వచ్చిన మంటలు క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బిర్యాని భోజనాలు వదిలి ఎటు వాళ్ళు అటు పరుగెత్తారు. బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్‌లో మంటలు కలకలకం రేపాయి. శుక్రవారం మధ్యాహ్నం హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్దిసేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన అనంతరం హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య.. ఎందుకంటే ??
జ్వరం, జలుబు, ఎలర్జీకి వాడే మందుల్లో కొన్నింటిపై నిషేధం
ఆటో పే ఆప్షన్ తో పెరుగుతున్న సైబర్ మోసాలు
Naga Chaitanya: కార్ రేసింగ్ టీమ్ ను కొన్న నాగ చైతన్య
Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా ?? ఇది మీ కోసమే !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

