జ్వరం, జలుబు, ఎలర్జీకి వాడే మందుల్లో కొన్నింటిపై నిషేధం

జ్వరం, జలుబు, ఎలర్జీకి వాడే మందుల్లో కొన్నింటిపై నిషేధం

Phani CH

|

Updated on: Aug 27, 2024 | 4:08 PM

దగ్గో.. జలుబో.. జ్వరమో వచ్చిందని ఇంట్లో ఉన్న మందు బిల్లలను మింగేస్తున్నారా? చిన్న దానికి డాక్టర్‌ దగ్గరికి ఎందుకని ఏది పడితే అది నోట్లో వేసుకుని రిలాక్స్‌ అవుతున్నారా? అయితే కొన్ని రకాల మందులు వేసుకుంటే మాత్రం యమ డేంజర్‌ అంటోంది సెంట్రల్‌ గవర్నమెంటు. రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు.

దగ్గో.. జలుబో.. జ్వరమో వచ్చిందని ఇంట్లో ఉన్న మందు బిల్లలను మింగేస్తున్నారా? చిన్న దానికి డాక్టర్‌ దగ్గరికి ఎందుకని ఏది పడితే అది నోట్లో వేసుకుని రిలాక్స్‌ అవుతున్నారా? అయితే కొన్ని రకాల మందులు వేసుకుంటే మాత్రం యమ డేంజర్‌ అంటోంది సెంట్రల్‌ గవర్నమెంటు. రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. బ్యాన్ చేసిన మందుల్లో చికిత్సకు ఉపయోగం కాని ఇంగ్రీడియెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయని తేలిందని కేంద్రం తెలిపింది. ఈ బ్యాన్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెఫెనమిక్ యాసిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పారాసిటమాల్​ ఇంజెక్షన్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎక్కువ మెడిసిన్స్ ఉన్నాయి. దీన్ని వాపులు, నొప్పి తగ్గించడానికి వాడతారు. ఓమెప్రజోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెగ్నీషియం, డైక్లోమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందులు కూడా ఉన్నాయి. వీటిని కడుపు నొప్పి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాడతున్నారు. ఫ్యాటీ లివర్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాడే యుర్సోడియాక్సికోలిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాన్ లిస్ట్‌‌‌‌లో ఉన్నాయి. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటో పే ఆప్షన్ తో పెరుగుతున్న సైబర్ మోసాలు

Naga Chaitanya: కార్‌ రేసింగ్ టీమ్ ను కొన్న నాగ చైతన్య

Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా ?? ఇది మీ కోసమే !!

ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా ?? ఈ సింపుల్‌ ట్రిక్‌ ట్రై చేయండి

రోడ్డెక్కిన రీల్స్ పిచ్చి… ట్రాఫిక్‌లో నోట్లు విసురుతూ వీడియోలు