Andhra Pradesh: అమెరికాలో ఇచ్ఛాపురం యవకుడు మృతి.. అసలేం జరిగిందంటే!
గత కొన్ని నెలలుగా భారతీయ యువత అమెరికాలో వరుసగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉద్యోగులు, విద్యార్ధులు మృతి చెందిన ఘటనలు దేవీ వాసులను కలవర పెడుతున్నాయి. తాజాగా అక్కడ మరో యువకుడు అశువులు బాశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు...
ఇచ్ఛాపురం, ఆగస్టు 29: గత కొన్ని నెలలుగా భారతీయ యువత అమెరికాలో వరుసగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉద్యోగులు, విద్యార్ధులు మృతి చెందిన ఘటనలు దేవీ వాసులను కలవర పెడుతున్నాయి. తాజాగా అక్కడ మరో యువకుడు అశువులు బాశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పెదిని కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు రూపక్‌రెడ్డి (26). అతడు 8 నెలల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. డెలవేర్‌లో ఉంటూ హారిస్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే మంగళవారం సాయంత్రం రూపక్‌రెడ్డి, అతడి స్నేహితులతో కలిసి మొత్తం ఐదు మందితో స్థానికంగా ఉన్న జార్జ్ లేక్‌కు వెళ్లాడు. అక్కడ బోటుపై షికారు సరస్సులో షికారుకు వెళ్లారు. సరస్సు మధ్యలోకి వెళ్లగానే.. అక్కడ ఉన్న పెద్ద రాయిపై ఎక్కి ఫొటోలు దిగేందుకు రూపక్‌రెడ్డి ప్రయత్నించారు.
ఈ క్రమంలో రూపక్‌రెడ్డితోపాటు అతని స్నేహితులు కూడా ఆ రాయి మీదకు ఎక్కారు. అయితే అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ఒక్కసారిగా పట్టుతప్పి రపక్ , అతడి స్నేహితుడు రాజీవ్ నీళ్లలోకి జారిపోయారు. మిగిలిన స్నేహితులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. నీళ్లలో పడిపోయిన రాజీవ్‌ను స్నేహితుడు కాపాడగా.. రూపక్ రెడ్డి నీటిలో మునిగిపోయారు. దీంతో స్నేహితుడు కళ్లెదుటే నీళ్లలో మునిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వంతో వెంటనే రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని, రూపక్‌రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఇచ్ఛాపురంలోని తల్లిదండ్రులు కవిరాజ్‌రెడ్డి, ధనవతి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో వారి ఆక్రందనలు మిన్నంటాయి. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
కాగా మృతుడు రూపక్‌రెడ్డి తండ్రి కవిరాజ్‌రెడ్డి ఇచ్ఛాపురం మండలం మండపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఒడియా స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి ధనవతి సంగీత కళాకారిణి. రూపక్ ఇచ్ఛాపురంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో టెన్ల్ క్లాస్, విశాఖపట్నంలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్, రాజాం జీంఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ చదివే సమయంలో సంజీవ్ అనే విద్యార్థితో స్నేహం ఏర్పడగా.. వీరిద్దరూ కలిసి బీటెక్ పూర్తయిన తరువాత ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు.