Cobra Video: వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్.
మామూలుగా ఎక్కడైనా పామును చూస్తే భయపడతారు. అలాంటిది ఇంట్లోనే పాములు కనిపిస్తే.. వణికిపోతారు. పాములు సాధారణంగా ఇంటి పరిసరాలలో,లేదా అడవుల్లో, ఆలయాల వద్ద కనబడుతుంటాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఏకంగా వంట గదిలో నాగుపాము ప్రత్యక్షమై పడగ విప్పింది. వంట చేసేందుకు కిచెన్ లోకి వెళ్లిన ఓ మహిళ గ్యాస్ పొయ్యి వద్ద.. పడగ విప్పిన నాగు పామును చూసి భయాందోళనకు గురి అయ్యింది.
మామూలుగా ఎక్కడైనా పామును చూస్తే భయపడతారు. అలాంటిది ఇంట్లోనే పాములు కనిపిస్తే.. వణికిపోతారు. పాములు సాధారణంగా ఇంటి పరిసరాలలో,లేదా అడవుల్లో, ఆలయాల వద్ద కనబడుతుంటాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఏకంగా వంట గదిలో నాగుపాము ప్రత్యక్షమై పడగ విప్పింది. వంట చేసేందుకు కిచెన్ లోకి వెళ్లిన ఓ మహిళ గ్యాస్ పొయ్యి వద్ద.. పడగ విప్పిన నాగు పామును చూసి భయాందోళనకు గురి అయ్యింది. వెంటనే తేరుకుని భయపడి కేకలు వేస్తూ బయటకి పరుగులు తీసింది. ఈ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్స్.. స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. స్నేక్ క్యాచర్ రావడానికి రెండు గంటల సమయం పట్టింది. ఆ రెండు గంటలసేపు నాగుపాము, అలాగే పడగ విప్పి ఉండడంతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వచ్చి నాగుపామును డబ్బాలో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును ఫారెస్ట్ అధికారులు అడవిలో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

