Viral: చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
బాల్కనీ ద్వారా ఓ ఫ్లాట్‌లోకి చొరబడిన 38 ఏళ్ల దొంగ విలువైన వస్తువుల కోసం వెదుకుతుండగా ఓ పుస్తకం కనిపించింది. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకం అతడిని ఆకర్షించింది. దానిని చదవకుండా ఉండలేకపోయాడు. తాను చోరీకి వచ్చిన విషయం మర్చిపోయి కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. 71 ఏళ్ల ఇంటి యజమాని లేచి చూసేసరికి ఓ ఆగంతకుడు తన ఇంట్లో పరిసరాలు మర్చిపోయి పుస్తకం చదవడంలో లీనమైన విషయాన్ని గుర్తించాడు.
ఇటలీ రాజధాని రోమ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ తాను వచ్చిన పని వదిలేసి పుస్తకం చదువుతూ ఉండిపోయాడు. ఇంతలో యజమాని వచ్చి భుజం తడితే కానీ ఈలోకంలోకి రాలేదు సదరు దొంగ. ఇంతకీ అదేం పుస్తకం.. ఎందుకు వచ్చిన పని మర్చిపోయి మరీ పుస్తకంలో మునిగిపోయాడు.? బాల్కనీ ద్వారా ఓ ఫ్లాట్‌లోకి చొరబడిన 38 ఏళ్ల దొంగ విలువైన వస్తువుల కోసం వెదుకుతుండగా ఓ పుస్తకం కనిపించింది. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకం అతడిని ఆకర్షించింది. దానిని చదవకుండా ఉండలేకపోయాడు. తాను చోరీకి వచ్చిన విషయం మర్చిపోయి కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. 71 ఏళ్ల ఇంటి యజమాని లేచి చూసేసరికి ఓ ఆగంతకుడు తన ఇంట్లో పరిసరాలు మర్చిపోయి పుస్తకం చదవడంలో లీనమైన విషయాన్ని గుర్తించాడు. యజమాని వచ్చిన విషయాన్ని కూడా గుర్తించని దొంగ పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయాడు. చివరికి యజమానే అతడి భుజంపై చేయి వేసి తట్టాడు. దీంతో ఈ లోకంలోకి వచ్చిన దొంగ.. పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. ఆ దొంగను అంతగా ఆకర్షించిన పుస్తకం ఏంటో తెలుసా? ‘గాడ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాక్’. దీనిని ప్రముఖ రచయిత గియోవన్నీ నుచీ. చోరీకి వచ్చి పుస్తకం చదవకుండా ఉండలేకపోయిన దొంగ విషయం తెలిసిన నుచీ.. ఆ దొంగను ఎలాగైనా వెతికి పట్టుకుని ఆ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పారు. అతడు దొరికిపోయే సరికి సగం పుస్తకం మాత్రమే చదివి ఉంటాడని, కాబట్టి పుస్తకాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

