AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రానున్న మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, బలమైన గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Andhra Weather
Follow us

|

Updated on: Aug 29, 2024 | 2:00 PM

ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఇది కేంద్రికృతం అయింది.  పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.  వాయుగుండంగా ఉత్తర ఆంధ్ర – దక్షిణ ఒడిస్సా తీరం వైపు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాగల మూడు రోజుల పాటు కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అలెర్ట్ జారీ చేసింది.

ఆగస్టు 29, గురువారం…  పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం,  అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తరకోస్తాలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ  చెబుతోంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు ఉంటాయని వెల్లడించింది. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని వెదర్ డిపార్ట్‌మెంట్ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
TGPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు
TGPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు
కూలింగ్ గ్లాసెస్ తో బళ్లారి జైలులోకి హీరో దర్శన్..సిబ్బందిపై వేటు
కూలింగ్ గ్లాసెస్ తో బళ్లారి జైలులోకి హీరో దర్శన్..సిబ్బందిపై వేటు
ముంబై నటి వ్యవహారంపై కదిలిన ఏపీ పోలీసులు..!
ముంబై నటి వ్యవహారంపై కదిలిన ఏపీ పోలీసులు..!
తెలంగాణలో 31 కొత్త FM రేడియో స్టేషన్లకు కేంద్రం పచ్చజెండా
తెలంగాణలో 31 కొత్త FM రేడియో స్టేషన్లకు కేంద్రం పచ్చజెండా
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
నాని హీరోయిన్ ఎంతలా మారిపోయింది..!
నాని హీరోయిన్ ఎంతలా మారిపోయింది..!
ఎండు మిర్చి తింటే బీపీ, షుగర్ కంట్రోల్.. ఇంకా ఎన్నో లాభాలు..
ఎండు మిర్చి తింటే బీపీ, షుగర్ కంట్రోల్.. ఇంకా ఎన్నో లాభాలు..
గణపతికి ఏఏ రాష్ట్రాల్లో ఏఏ ఆహరాన్ని నైవేద్యంగా సమర్పిస్తారంటే
గణపతికి ఏఏ రాష్ట్రాల్లో ఏఏ ఆహరాన్ని నైవేద్యంగా సమర్పిస్తారంటే
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్