School Holidays: నిండు కుండలా గంగానది.. ఆగస్టు 31 వరకు 76 స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా వానలు విరుచుకు పడుతుండటంతో రోడ్లు జలమవుతున్నాయి. ఆ నీరంతా లోతట్టు ప్రాంతాలకు చేరి, చెరువులను తలపిస్తున్నాయి. ఇక వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అన్ని ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో..

School Holidays: నిండు కుండలా గంగానది.. ఆగస్టు 31 వరకు 76 స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
School Holidays
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 28, 2024 | 8:04 PM

పట్నా, ఆగస్టు 28: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా వానలు విరుచుకు పడుతుండటంతో రోడ్లు జలమవుతున్నాయి. ఆ నీరంతా లోతట్టు ప్రాంతాలకు చేరి, చెరువులను తలపిస్తున్నాయి. ఇక వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అన్ని ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్‌ రాష్ట్రంలోని గంగా నది సైతం ప్రమాదం అంచున ఉంది. నదిలో నీటి మట్టం భారీగా పెరిగిపోతుండటంతో స్థానికుల గుండెల్లో గుబులు రేగుతుంది. ఎటునుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని అరచేతుల్లో ప్రాణాలు దాచుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ క్రమంలో బీహార్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ రాష్ట్ర రాజధాని పట్నాలో గంగానది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకు మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‘గంగా నదిలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా పాట్నా జిల్లాలోని ఎనిమిది బ్లాకుల్లో మొత్తం 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకూ మూసివేస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇటీవలే పట్నా సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గంగా నదిలో పడి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా విద్యార్థుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా సెలవులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.