AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natasha Danish Ali: ‘ఏయ్.. మా నాన్న ఎవరో తెలుసా?’ కారుతో ఢీకొట్టి ఇద్దరిని చంపిన యువతి వింత ప్రవ‌ర్తన చూశారా.. వీడియో

పాకిస్థాన్‌ రాజధాని కరాచీలో ఓ మ‌హిళ త‌న కారుతో బీభ‌త్సం సృష్టించింది. ఆగస్టు 19న క‌ర్సాజ్ రోడ్డులో టొయోటా ల్యాండ్ క్రూయిర్ కారులో వెళ్తూ పలు వాహ‌నాల‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్‌పై వెళ్తున్న తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. అనేక వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. ఇందీంతో కారుతో వీరంగం సృష్టించిన సదరు పాకిస్థాన్ మ‌హిళ‌ ఏ మాత్రం పశ్చాతాపపడకుండా.. నవ్వుతూ వీడియోలకు ఫోజు..

Natasha Danish Ali: 'ఏయ్.. మా నాన్న ఎవరో తెలుసా?' కారుతో ఢీకొట్టి ఇద్దరిని చంపిన యువతి వింత ప్రవ‌ర్తన చూశారా.. వీడియో
Natasha Danish Ali Car Accident Case
Srilakshmi C
|

Updated on: Aug 28, 2024 | 6:16 PM

Share

క‌రాచీ, ఆగస్టు 28: పాకిస్థాన్‌ రాజధాని కరాచీలో ఓ మ‌హిళ త‌న కారుతో బీభ‌త్సం సృష్టించింది. ఆగస్టు 19న క‌ర్సాజ్ రోడ్డులో టొయోటా ల్యాండ్ క్రూయిర్ కారులో వెళ్తూ పలు వాహ‌నాల‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్‌పై వెళ్తున్న తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. అనేక వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. ఇందీంతో కారుతో వీరంగం సృష్టించిన సదరు పాకిస్థాన్ మ‌హిళ‌ ఏ మాత్రం పశ్చాతాపపడకుండా.. నవ్వుతూ వీడియోలకు ఫోజులిచ్చింది. పైగా మా నాన్న ఎవరో తెలుసా? అంటూ బెదిరింపులకు దిగింది. దీంతో ఆమె ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సదరు మహిళను న‌టాషా దానిష్ అలీగా పోలీసులు గుర్తించారు. ఆమె పాక్‌లోని ప్రఖ్యాత వ్యాపార‌వేత్త దానిష్ ఇక్బాల్ భార్య. ఆగ‌స్టు 19వ తేదీన ఆమె కారులో రోడ్డుపై మితిమీకిర వేగంతో వెళ్తూ.. బైక్‌, ఆగివున్న కారుతో సహా పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు క్లిప్‌లో నెట్టింట వైరల్ అయ్యాయి. కారుతో ఢీకొట్టి ఇద్దరి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఆమె .. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత వింత‌గా ప్రవ‌ర్తించింది. కెమెరా వైపు చూసి, నిర్లక్ష్యంగా న‌వ్వుతూ కనిపించింది. ప‌శ్చాతాపం ఏ కొశానా క‌నిపించ‌లేదు. పైగా మా నాన్న ఎవ‌రో మీకు తెలియ‌ద‌ని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో సదరు యువతి చర్యను నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. సోషల్‌ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి..

స్థానిక న్యూస్‌ కథనాల ప్రకారం.. న‌టాషా దానిష్ (32) కరాచీలో పుట్టింది. పాక్‌లో ప్రముఖ వ్యాపారి డానిష్ ఇక్బాల్‌ను కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకుంది. గుల్ అహ్మద్ ఎన‌ర్జీ సంస్థకు చైర్మెన్‌. ఈ దంపతులకు క‌రాచీలోని కేడీఏ స్కీమ్ -1 ఏరియాలో విలాసవంతమైన నివాసం ఉంది. ప్రమాద సమయంలో నటాషా మద్యం మత్తులో ఉందని, ప్రమాదం తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఆమె మాన‌సిక పరిస్థితి సరిగ్గాలేదని, జిన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని నటాషా తరపు న్యాయవాది అమీర్ మన్సుబ్ మీడియాకు తెలిపారు. ఆమెకు చికిత్స పూర్తైందని, ఆమెకు ఎలాంటి చికిత్స అవసరం లేదని, డిశ్చార్జ్ కూడా అయినట్లు ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. నటాషా మానసిక అనారోగ్యాన్ని సాకుగా చెబుతూ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుంది. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది. సామాన్య జనాల ప్రాణాలంటే బలిసినోళ్లకు ఎప్పుడూ అలుసే..!

ఇక్కడ వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.