Viral Video: ఛీ..ఛీ.. పోలీస్‌ వ్యవస్థకే సిగ్గుచేటు! దళితులపై ఇంత ద్వేషమా? తప్పొకరిది.. శిక్ష మరొకరికి!

తప్పు చేసిన వారిని చట్టానికి పట్టియ్యాల్సిన పోలీసులు.. కొన్ని చోట్ల వీధి రౌడీల కన్నా దిగజారిపోతున్నారు. బడా బాబుల కనుసన్నల్లో మెదులుతూ.. దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. తండ్రి పరారీలో ఉంటే దర్యాప్తు పేరిట స్టేషన్‌కు పిలిపించి 15 ఏళ్ల దళిత బాలుడు, అతని వృద్ధ నానమ్మను పోలీస్‌ అధికారులు విచక్షణా రహితంగా కొట్టిన వీడియో ఒకటి బయటికొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో దారుణ ఘటన ఆలస్యంగా..

Viral Video: ఛీ..ఛీ.. పోలీస్‌ వ్యవస్థకే సిగ్గుచేటు! దళితులపై ఇంత ద్వేషమా? తప్పొకరిది.. శిక్ష మరొకరికి!
Woman Police Beats Elderly Dalit Woman
Follow us

|

Updated on: Aug 29, 2024 | 8:46 PM

భోపాల్‌, ఆగస్టు 29: తప్పు చేసిన వారిని చట్టానికి పట్టియ్యాల్సిన పోలీసులు.. కొన్ని చోట్ల వీధి రౌడీల కన్నా దిగజారిపోతున్నారు. బడా బాబుల కనుసన్నల్లో మెదులుతూ.. దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. తండ్రి పరారీలో ఉంటే దర్యాప్తు పేరిట స్టేషన్‌కు పిలిపించి 15 ఏళ్ల దళిత బాలుడు, అతని వృద్ధ నానమ్మను పోలీస్‌ అధికారులు విచక్షణా రహితంగా కొట్టిన వీడియో ఒకటి బయటికొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళితులను పురుగుల కన్నా హీనంగా ట్రీట్‌ చేస్తున్న ఈ పోలీసులను చూస్తే మీరూ అసహ్యించుకుంటారు. ఓ సారి ఈ వీడియో చూడండి..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని కట్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అరుణ వగనే అనే అధికారి.. ఓ బాలుడిని, వృద్ధురాలిని గొడ్డును బాదినట్టు బాదడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో కుసుమ్ వాన్స్కర్ అనే మహిళను సదరు మహిళా అధికారి కర్రతో కొట్టడం చూడొచ్చు. దెబ్బలకు తాళలేక వృద్ధురాలు చేతులెత్తి దండం పెడుతూ.. విలపించడం వీడియోలో కనిపిస్తుంది. అయినా కనికరించిన అరుణ ఆమెను పదేపదే కర్రతో కొట్టడం వీడియోలో చూడొచ్చు. అనంతరం ఆమె మనవడిని కూడా పోలీసులు కర్రతో కొట్టడం, కాలితో తన్నడం వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అదే రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వాంటెడ్ క్రిమినల్ అయిన తన కొడుకు గురించి వివరాలు అడిగిన రైల్వే పోలీసులు తనను రాత్రంతా ఇదే విధంగా కొట్టారని మహిళ మీడియాకు చెప్పుకుని కుళ్లికుళ్లి ఏడ్చింది. తన్నులకు తాళలేక తాను నీళ్లు అడిగితే అధికారులు మళ్లీ మళ్లీ కొట్టారని ఆమె విలపించింది. బాధితురాలి మాటల్లో వివరాలు..

ఇవి కూడా చదవండి

కొడుకుపై 19 కేసులు.. దర్యాప్తు పేరిటి స్టేషన్‌కి పిలిచి అమానుషం

‘పోలీసులు నన్ను స్టేసన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఓ సీనియర్ అధికారి నన్ను లోపలికి పిలిచారని చెప్పి ఆయన బయటే ఉండిపోయాడు. లోపలికి వెళ్లగానే అక్కడున్న మహిళా అధికారి.. నా కొడుకు ఎక్కడ ఉన్నాడని నన్ను ప్రశ్నించాడు. అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదని, అతను దొరికితే పట్టుకోమని చెప్పాను. అతన్ని కొట్టండి, మీరు కోరుకున్నది చేయండి అని అన్నారు. కానీ మహిళా అధికారి నా మాటలు పట్టించుకోలేదు. వెంటనే ఆ గది తలుపులు, కిటికీలు మూసివేసింది. అనంతరం నన్ను ప్లాస్టిక్ లాఠీతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. కాలితో తన్నుతూ దుర్భాషలాడింది. అలా ఆ రోజు రాత్రంతా నన్ను కొట్టారు.. నీళ్ళు అడిగితే మళ్లీ కొట్టారు. నాతో పాటు వచ్చిన నా మనవడిని వేరే చోటికి తీసుకెళ్లి కొట్టారు… అని బాధిత మహిళ పెళ్లుభికిన దుఃఖాన్ని అణచుకుంటూ మీడియాకు తెలిపింది.

‘లా అండ్ ఆర్డర్ పేరుతో గూండాయిజానికి పాల్పడుతున్నారా?’

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని నెటిజన్లతోపాటు ప్రతిపక్షం ఏకిపారేస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘దళితులపై అణచివేతకు’ ఈ ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘దళితులపై అణచివేత బీజేపీకి అతిపెద్ద ఆయుధంగా మారిందని’ ఆరోపించారు. ఈ రాజకీయ దురక్రమణ ఆగాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టు షేర్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని దళితులు బీజేపీ దుష్పరిపాలనలో భయంకరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను రక్షించలేకపోతే, వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ‘లా అండ్ ఆర్డర్ పేరుతో గూండాయిజానికి పాల్పడి ప్రజలను చంపుతున్నారని’ మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్టు షేర్‌ చేసింది.

మాకు ఫిర్యాదు రాలేదు.. ASP సెహ్రియా

బాధిత మహిళను, ఆమె మనవడిని కొట్టిన మహిళా అధికారి అరుణా వగనే మాట్లాడుతూ.. కుసుమ్ వంస్కర్ కుమారుడు, దీప్‌రాజ్ తండ్రి దీపక్ వాన్‌స్కర్‌పై 19 కేసులు ఉన్నాయి. అతనిపై రూ.10,000 రూపాయల రివార్డ్‌ కూడా ప్రకటించాం. అతని కుటుంబం మొత్తం నేరస్తుడికి మద్దతుగా నిలుస్తుంది. అందుకే అతని కుటుంబ సభ్యులను విచారణ కోసం పిలిపించామని చెప్పుకొచ్చింది. ఈ ఘటన 2023 అక్టోబర్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీపక్ వంస్కర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఈ వీడియో వైరల్‌ నేపథ్యంలో జబల్‌పూర్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ (SRP) స్టేషన్ ఇన్‌చార్జి అరుణను సస్పెండ్ చేశామని, డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో దర్యాప్తుకు ఆదేశించామని పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ సెహ్రియా తెలిపారు. దీపక్ వాన్‌స్కర్ హిస్టరీ-షీటర్ అని, 2017 నుంచి నిఘాలో ఉన్నాడని తెలిపారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోకు సంబంధించి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసి, వాస్తవాలను నిగ్గుతేలుస్తామని ASP సెహ్రియా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో