Andhra Pradesh: ‘కన్నా.. లేరా! ఈ రోజు నీ పుట్టిన రోజు.. కొత్త బట్టలు తెచ్చా’ జన్మదినం రోజే కొడుకు మృతి

తెలుగు రాష్ట్రాల్లో విష జ్వారాలు ప్రభలుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు వదలగా.. వేల సంఖ్యలో జ్వరాలతో పోరాడుతున్నారు. ఎక్కువగా వైరల్‌ జ్వరాలు పిల్లలను పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికే లేత వయసులోనే జ్వరాలతో పలువురు పిల్లలు మృతి చెందారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో మరో పసివాడు విష జ్వరం..

Andhra Pradesh: 'కన్నా.. లేరా! ఈ రోజు నీ పుట్టిన రోజు.. కొత్త బట్టలు తెచ్చా' జన్మదినం రోజే కొడుకు మృతి
Boy Died Of Viral Fever
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 29, 2024 | 5:40 PM

ఉరవకొండ, ఆగస్టు 29: తెలుగు రాష్ట్రాల్లో విష జ్వారాలు ప్రభలుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు వదలగా.. వేల సంఖ్యలో జ్వరాలతో పోరాడుతున్నారు. ఎక్కువగా వైరల్‌ జ్వరాలు పిల్లలను పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికే లేత వయసులోనే జ్వరాలతో పలువురు పిల్లలు మృతి చెందారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో మరో పసివాడు విష జ్వరం వల్ల ప్రాణాలు వదిలాడు. అదీ సరిగ్గా పుట్టిన రోజునాడు పిల్లవాడు మృతి చెందడంతో కన్నవారు గుండెలవిసేలా రోధించారు. వివరాల్లోకెళ్తే..

ఉరవకొండ పట్టణం స్థానిక పాత మార్కెట్‌ సమీపంలో చాపదేవుని గుడి వద్ద నివాసముంటున్న అయ్యర్‌ బాబా ఫకృద్దీన్‌ ఉరవకొండ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య హుమేరా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ఆజీంబాషా (14) ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రయివేట్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆజీం బాషాకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఉరవకొండలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి జ్వరం తగ్గకపోగా.. రక్త కణాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా అనంతపురంలోని కార్పొరేటు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే అక్కడ చికిత్స ఫలించక బుధవారం ఉదయం అజీంబాషా కన్నుమూశాడు.

బుధవారం అజీంబాషా పుట్టిన రోజు. కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరపాలని తల్లిదండ్రులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. కుమారుడికి కొత్త దుస్తులు, చాక్లెట్లు కూడా తెచ్చారు. తమ కుమారుడు బతికి ఉంటే ఈ రోజు సంతోషంగా పుట్టిన రోజు జరుపుకునే వాడని, పుట్టిన రోజే ఆకరి రోజైందనీ.. ఆజీంబాషా మృతితో కన్నవాళ్లు విలవిలలాడారు. ఎంతో ఉల్లాసంగా, ఇళ్లంతా సందడి చేసే ఆజీంబాషా మృతితో పాత మార్కెట్‌ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.