TTD: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లడ్డూ కావాలంటే అది తప్పనిసరి

ప్రస్తుతం పని ఏదైనా.. ప్రభుత్వ పథకాలు ఏవైనా అధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇలాంటి తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో పలు మార్పులు తెచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు లడ్డూ కావాలంటే..

TTD: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లడ్డూ కావాలంటే అది తప్పనిసరి
Tirumala Tirupati Devasthanams
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2024 | 7:13 PM

ప్రస్తుతం పని ఏదైనా.. ప్రభుత్వ పథకాలు ఏవైనా అధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇలాంటి తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో పలు మార్పులు తెచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు లడ్డూ కావాలంటే ఆధార్ తప్పనిసరిగా చూపించాలని తెలిపింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా రూల్స్ మార్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. దర్శనం టికెట్లు లేని భక్తులు ఆధార్ కార్డు చూపిస్తే.. ఉచిత లడ్డూతో పాటు మరో లడ్డూ ప్రసాదాన్ని కలిపి రెండు లడ్డూలు ఇస్తారు. అలాగే దర్శనం టికెట్ ఉన్న భక్తులకు లడ్డూల లభ్యత బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు ఇవ్వనున్నట్టు టీటీడీ పేర్కొంది. ఇక టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీవారి లడ్డూ ప్రసాదం మిస్ యూజ్ అవుతుండటంతో పాటు దళారీల వ్యవస్థను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ స్పష్టం చేశారు.

గురువారం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటన పెద్ద వివాదానికి దారి తీయగా.. ఆధార్ కార్డుతో లడ్డూ విక్రయాలు చేస్తున్న టీటీడీ తీరుపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో శ్రీవారి భక్తులు అడిగినన్ని లడ్డూలు టీటీడీ ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు రద్దీ సమయంలో లడ్డూ విక్రయాలపై ఆంక్షలు విధించింది. కాగా, ప్రస్తుతం రోజూ దాదాపు 3.50 లక్షల లడ్డూలు టీటీడీ విక్రయిస్తోంది.

ఇది చదవండి: ఆదివారం వచ్చిందంటే ఆ గ్రామంలో నాన్-వెజ్ బంద్.. కారణం తెలిస్తే

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..