హ్యాండ్ బ్రేక్‌ను హ్యాండిల్ చేయడం ఎలా.? ఈ తప్పు చేస్తే యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే

ప్రైవేటు లేదా గవర్నమెంట్ అనేది తేడా.. ఇప్పుడు ఎవరు ఏ జాబ్ చేస్తున్నా.. వారి దగ్గర నాలుగు చక్రాల బండి ఉండాల్సిందే. అదేనండీ.! 'ది కార్'. దేశంలోని పలు మెట్రోపాలిటన్ సిటీలలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది.

హ్యాండ్ బ్రేక్‌ను హ్యాండిల్ చేయడం ఎలా.? ఈ తప్పు చేస్తే యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే
Car Handbrake
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 23, 2024 | 7:16 PM

ప్రైవేటు లేదా గవర్నమెంట్ అనేది తేడా.. ఇప్పుడు ఎవరు ఏ జాబ్ చేస్తున్నా.. వారి దగ్గర నాలుగు చక్రాల బండి ఉండాల్సిందే. అదేనండీ.! ‘ది కార్’. దేశంలోని పలు మెట్రోపాలిటన్ సిటీలలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. పూర్వకాలం ఒక ఎత్తయితే.. ఇప్పుడు మరో ఎత్తు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది. యాక్సిడెంట్స్‌కు ఎలాంటి తావులేకుండా.. అత్యుత్తమ ప్రమాణాలతో కార్లను తయారు చేస్తున్నాయి పలు దిగ్గజ కంపెనీలు. సరే.! ఇక ఈ ఇంట్రడక్షన్ అంతా పక్కన పెడితే.. అత్యవసర పరిస్థితుల్లో లేదా యాక్సిడెంట్స్‌ను తప్పించేందుకు కారులో హ్యాండ్‌ బ్రేక్ అనేది కీలకం. అయితే ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు.

హ్యాండ్ బ్రేక్‌ను అసలు ఎక్కడెక్కడ వినియోగిస్తారు.? పార్కింగ్ చేసేటప్పుడు లేదా ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కువ సమయంలో వేచి ఉన్నప్పుడు.. ఈ హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగిస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదపుటంచుల నుంచి మనల్ని కాపాడే ఈ హ్యాండ్‌బ్రేక్‌ను అసలెప్పుడు వాడొచ్చునంటే.?

అత్యవసరమైనప్పుడు మాత్రమే హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించాలి. కారు హైస్పీడ్‌లో ఉండగా.. దాన్ని కంట్రోల్ చేసేందుకు పొరపాటున కూడా మీ చేయి హ్యాండ్‌బ్రేక్ వైపునకు వెళ్లనివ్వకండి. ఆ సమయంలో మీరు వాడినట్లయితే.. వెనుక చక్రాలు లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కారుపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. పరిమితి వేగంలో ఉన్నప్పుడు.. లేదా వాహనం ఆగి ఉన్నప్పుడు హ్యాండ్‌బ్రేక్ వాడటం ఉత్తమం. ఒకవేళ మీ ఫుట్ బ్రేక్ పెడల్ పని చేయని పరిస్థితుల్లో హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించడం తప్ప వేరే మార్గం లేదు. అలా కాదని మీ కారులో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉన్నట్లయితే.. హ్యాండ్ బ్రేక్ లివర్‌ను లాగడం లేదా హ్యాండ్‌బ్రేక్ బటన్‌ను నొక్కితే చాలు.. కారు వెంటనే స్లో అవుతుంది. హ్యాండ్‌బ్రేక్ వాడుతున్న సమయాల్లో మీరు రోడ్డుకు ఇరువైపులా పూర్తిగా దృష్టి సారించాలి.. లేదంటే ఇతరులకు ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఒకవేళ హ్యాండ్ బ్రేక్ వాడేటప్పుడు కారు స్కిడ్ అవుతోందని మీకు అనిపిస్తున్నట్లయితే.. వెంటనే హ్యాండ్ బ్రేక్ లివర్ మూమెంట్‌ను కొంచెం కొంచెంగా తగ్గించండి.

హ్యాండ్ బ్రేక్ సాయంతో కారును ఆపిన వెంటనే.. డేంజర్ లైట్స్(హజార్డ్ లైట్స్)‌ను ఆన్ చేయండి. దీని వల్ల ఇతర వాహనదారులకు ఒక వార్నింగ్ సిగ్నల్ ఇవ్వొచ్చు. మీకు వీలైనంతవరకు కారును సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేయండి. అత్యవసర పరిస్థితుల్లో హ్యాండ్ బ్రేక్‌ను వినియోగించడం వల్ల.. అప్పుడప్పుడూ కారు బ్రేక్ సిస్టమ్ లేదా ఇతర భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే.. మెకానిక్ ద్వారా మీ కారును చెక్ చేయించుకోవడం మంచిది. ఇక ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే.. హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగించేటప్పుడు మనం కామ్ అండ్ కూల్‌గా ఉండటం చాలా ముఖ్యం.