AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోనే మొట్టమొదటి మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్.. ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు

మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ రూపొందించారు. దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారంనాడు ఆవిష్కరించారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఏపీలో అభివృద్ధి చేయడం అభినందనీయని చంద్రబాబు నాయుడు కొనియాడారు

దేశంలోనే మొట్టమొదటి మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్.. ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu Naidu
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Aug 29, 2024 | 4:59 PM

Share

విశాఖపట్నం (29 ఆగస్టు, 2024): మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ రూపొందించారు. దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారంనాడు ఆవిష్కరించారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఏపీలో అభివృద్ధి చేయడం అభినందనీయని చంద్రబాబు నాయుడు కొనియాడారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ కిట్ ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

తక్కువ ధరతో….

ఈ కిట్ ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెడ్ టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్‌ (ErbaMDx MonkeyPox RT-PCR Kit) పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఈఓ జితేంద్ర శర్మ సీఎంకు వివరించారు. ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని తెలిపారు. మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను రూపొందించిన మెడ్ టెక్ జోన్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు.

ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు..

మేక్ ఇన్ ఏపీ బ్రాండ్…

రాష్ట్రానికి మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రావడానికి ఈ కిట్ దోహదపడుతుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం నుండి మెడ్ టెక్ జోన్ కు అన్ని విధాలా సహాయ,సహకారాలు అందిస్తామన్నారు. వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్ తో నడిచే ఎలక్ట్రానికి వీల్ చైర్ ను రూపొందించనున్నట్లు మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.