బాలీవుడ్ నటి కేసుపై స్పందించిన విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు.. విచారణకు ఆదేశం
ముంబైకి చెందిన సినీనటి కాదంబరీ జెట్వాని వేధింపుల వ్యవహారంపై ఏపీ పోలీసులు స్పందించింది. పోలీసులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు.
ముంబైకి చెందిన సినీనటి కాదంబరీ జెట్వాని వేధింపుల వ్యవహారంపై ఏపీ పోలీసులు స్పందించింది. పోలీసులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు. జెట్వానితో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నుంచి విజయవాడ సీపీ ఆదేశాలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. విచారణలో భాగంగా ప్రత్యేక పోలీస్ బృందం ముంబై వెళ్లే అవకాశాలున్నాయి.
ముంబై నటి కేసులో సీరియస్ ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులతో పాటు పోలీసులు వేధింపులకు గురి చేశారని నటి ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. వెంటనే విచారణ జరపాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ దర్యాప్తు చేపట్టారు. కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరుగుతుందని సీపీ తెలిపారు. సీనియర్ ఐపీఎస్‌లపై ఆరోపణలు కాబట్టి డీజీపీతో చర్చిస్తామన్నారు సీపీ. ఈ కేసు విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్‌ను నియమిస్తూ విజయవాడ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో ఉంది కాబట్టి డీజీపీతో మాట్లాడిన తర్వాతే ముందుకెళ్తామన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని సీపీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ముంబై కు చెందిన నటిని 2024 ఫిబ్రవరి లో విజయవాడ కు తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించారని ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..