AP Rains: ఫుల్‌గా వానలే వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు కుండబోతే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఐఎండీ సూచనల ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి మరింతగా బలపడే అవకాశం ఉందన్నారు.

AP Rains: ఫుల్‌గా వానలే వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు కుండబోతే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2024 | 7:33 PM

ఐఎండీ సూచనల ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి మరింతగా బలపడే అవకాశం ఉందన్నారు. ఆతర్వాత ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు.

దీని ప్రభావంతో శుక్ర,శనివారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాతీరం వెంబడి గంటకు 45-55కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలపై అత్యవసర సహాయం కోసం విపత్తుల సంస్థలోని టోల్ ఫ్రీ 1070, 112, 18004250101 నెంబర్లను సంప్రదించాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

రానున్న నాలుగు రోజుల వాతావరణం వివరాలు..

30 ఆగష్టు, శుక్రవారం..

ఇవి కూడా చదవండి

అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

31 ఆగష్టు, శనివారం..

కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

01 సెప్టెంబర్, ఆదివారం..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లడ్డూ కావాలంటే అది తప్పనిసరి

02 సెప్టెంబర్, సోమవారం..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..