Viral Video: రోడ్డుపై యువతిని వేధించిన ఆకతాయి.. అటుగా వచ్చిన బస్సు ఆగడంతో దుమ్ముదుమారం! వీడియో

ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. ఎందరినీ శిక్షించినా.. దేశంలో నిత్యం ఏదోకమూల అమ్మాయిలపై అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అపాయంలో ఉన్న అమ్మాయిలను ప్రతీ చోట, ప్రతీసారి ఎవరో ఒకరు వచ్చి కాపాడలేని పరిస్థితి. దీంతో ఎందరో అడపిల్లల జీవితాలు రాలిపోతున్నాయి. తాజాగా పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ ఆకతాయి రోడ్డుపై వెళ్తున్న యువతి వెంటపడటమేకాకుండా ఆమెను కొడుతూ.. చిత్రహింసలు..

Viral Video: రోడ్డుపై యువతిని వేధించిన ఆకతాయి.. అటుగా వచ్చిన బస్సు ఆగడంతో దుమ్ముదుమారం! వీడియో
Women Harassment On Road
Follow us

|

Updated on: Aug 30, 2024 | 5:33 PM

ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. ఎందరినీ శిక్షించినా.. దేశంలో నిత్యం ఏదోకమూల అమ్మాయిలపై అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అపాయంలో ఉన్న అమ్మాయిలను ప్రతీ చోట, ప్రతీసారి ఎవరో ఒకరు వచ్చి కాపాడలేని పరిస్థితి. దీంతో ఎందరో అడపిల్లల జీవితాలు రాలిపోతున్నాయి. తాజాగా పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ ఆకతాయి రోడ్డుపై వెళ్తున్న యువతి వెంటపడటమేకాకుండా ఆమెను కొడుతూ.. చిత్రహింసలు పెట్టసాగాడు. పైగా అది నిర్మానుష్య ప్రదేశం కావడంతో జనసంచారం కూడా తక్కువగా ఉంది. ఇదే అదనుగా సదరు ఆకతాయి మరింత రెచ్చిపోయాడు. అయితే ఇంతలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అటుగా వచ్చిన ఓ బస్సు ఉన్నట్లుండి ఆగడంతో అందులోని ప్రయాణికులు దిగొచ్చి.. సదరు ఆకతాయిని చితక్కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి యువతిని వేధించడం, శారీరకంగా దాడి చేయడం కనిపిస్తుంది. అదే రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సులోని ప్రయాణికులు గమనించడంతో ఈ ఘటనలో మలుపు చోటు చేసుకుంది. అంతే.. మెరుపు వేగంతో బస్సు ఆపు చేయించారు. అనంతరం బస్సులోని ప్రయాణికులు అప్రమత్తమై యువతిని వేధిస్తున్న వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రయాణీకులు ధైర్యంతో జోక్యం చేసుకోవడంతో నిందితుడి బారీ నుంచి యువతిని కాపాడగలిగారు. రోడ్డుపై ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడం కేవలం వ్యక్తిగత కర్తవ్యం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతని ఈ సంఘటన నిరూపిస్తుంది. మన చుట్టూ ఎక్కడైనా ఇలాంటి దుశ్చర్యలకు ఎవరైనా పాల్పడితే.. ఇదే మాదిరి వ్యక్తులు సంఘీభావం, ధైర్యసాహసాలు చూపాలని, తద్వారా మన కుటుంబాల్లోని ఆడపిల్లలను కాపాడగలుగుతామని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. రేపటి సమాజం కోసం ఇలాంటి మార్పు ఎంతైనా అవసరం. మాకెందుకులే అని ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తూ.. ప్రేక్షకపాత్ర పోషిస్తే ఇదే పరిస్థితి రేపు నీ ఇంటి వరకూ వస్తుంది. అప్పుడు కాపాడేందుకు ఎవ్వరూ ముందుకురారు..!

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

యువతిని వేధించిన ఆకతాయి..అటుగావెళ్తున్న బస్సు ఆగడంతో సీన్ రివర్స్
యువతిని వేధించిన ఆకతాయి..అటుగావెళ్తున్న బస్సు ఆగడంతో సీన్ రివర్స్
మీరు ఆర్టీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు!
మీరు ఆర్టీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు!
ఈ వస్తువులతో వినాయక చవితి రోజున పూజ చేయవద్దు . . ఎందుకంటే
ఈ వస్తువులతో వినాయక చవితి రోజున పూజ చేయవద్దు . . ఎందుకంటే
మార్కెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే.. అత్యధిక రేంజ్..
మార్కెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే.. అత్యధిక రేంజ్..
డిజిటల్ యుగంలో సవాళ్లపై NBFతో మోదీ చర్చ
డిజిటల్ యుగంలో సవాళ్లపై NBFతో మోదీ చర్చ
కేంద్ర సహకరం.. ఏపీ ప్రాజెక్టులకు గ్రహణం వీడినట్లే..!
కేంద్ర సహకరం.. ఏపీ ప్రాజెక్టులకు గ్రహణం వీడినట్లే..!
ఏపీకి వాయుగుండం ముప్పు.. ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఏపీకి వాయుగుండం ముప్పు.. ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప్రవేశాల‌కు మ‌రోమారు గ‌డువు పెంపు
తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప్రవేశాల‌కు మ‌రోమారు గ‌డువు పెంపు
సెప్టెంబర్‌లో వందే భారత్‌తో సహా 74 రైళ్లు రద్దు..కారణం ఏంటంటే..
సెప్టెంబర్‌లో వందే భారత్‌తో సహా 74 రైళ్లు రద్దు..కారణం ఏంటంటే..
అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు..
అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..
పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..
'కల్కిగా నేచురల్ స్టార్' ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని
'కల్కిగా నేచురల్ స్టార్' ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని
బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్ బన్నీని ఫాలో అవుతున్న నాని
సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్ బన్నీని ఫాలో అవుతున్న నాని
దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం
దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం
హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్
హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్