Kolkata: అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
దేశానికి రాజైనా తల్లికి కొడుకే. చట్టానికి, సమాజానికి క్రూరుడైనా తల్లికి బిడ్డే అని ఆమె మాటలు వింటే అర్ధమవుతుంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ మృగాడి తల్లి మాత్రం తన బిడ్డ ఎంతో మంచివాడని చెబుతోంది. అంతేకాదు ఘటన జరిగినప్పటి నుంచి తన కుమారుడిని చూడలేదని తెలిపింది. కోర్టులో ఎలా అప్పీల్ చేయాలో తనకు తెలియదని సంజయ్ రాయ్ తల్లి తాజాగా ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
దేశానికి రాజైనా తల్లికి కొడుకే. చట్టానికి, సమాజానికి క్రూరుడైనా తల్లికి బిడ్డే అని ఆమె మాటలు వింటే అర్ధమవుతుంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ మృగాడి తల్లి మాత్రం తన బిడ్డ ఎంతో మంచివాడని చెబుతోంది. అంతేకాదు ఘటన జరిగినప్పటి నుంచి తన కుమారుడిని చూడలేదని తెలిపింది. కోర్టులో ఎలా అప్పీల్ చేయాలో తనకు తెలియదని సంజయ్ రాయ్ తల్లి తాజాగా ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు అన్నం వండిపెట్టడంతో సహా రాయ్ తనని చక్కగా చూసుకునేవాడంది. సంజయ్ రాయ్ కళాశాల గ్రాడ్యుయేట్ అని ఎన్‌సిసి కార్ప్స్‌లో భాగమని, బాక్సింగ్ నేర్చుకున్నాడనీ అతని తండ్రి చాలా కఠినంగా క్రమశిక్షణతో ఉండేవాడనీ చెప్పింది. బహుశా తాను ఇంకా కఠినంగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని తెలిపింది.
సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతని ‘దుష్ప్రవర్తన‘ కారణంగా అతని మునుపటి ముగ్గురు భార్యలు అతనిని విడిచిపెట్టారని ఇరుగుపొరుగు వారు చెబుతున్న విషయాలని అతని తల్లి ఖండించింది. సంజయ్ మొదటి భార్య మంచి అమ్మాయనీ వారిరువురూ సఖ్యతగా ఉండేవారనీ అకస్మాత్తుగా ఆమెకు క్యాన్సర్ రావడంతో రాయ్ డిప్రెషన్‌లోకి వెళ్లాడని మద్యం తాగడం ప్రారంభించాడని అయితే ఆ అలవాటు వదులుకోవాలని ఎన్నో సార్లు చెప్పినట్లు తెలిపారు. హాస్పిటల్‌లో రాయ్ కార్యకలాపాల గురించి తనకు తెలియదని అతడు అసాధారణంగా ఎప్పుడూ ప్రవర్తించింది లేదని ఆమె నొక్కి చెప్పింది. తన కొడుకు ప్రమాదకారి కాదని, ఎవరైనా అతన్ని ఇరికించినట్లయితే, ఆ వ్యక్తి శిక్షకు గురవుతాడనీ లేక తన కొడుకే నేరం చేసి ఉంటే, దేవుడే అతన్ని శిక్షిస్తాడంటూ స్పష్టం చేసింది. కొడుకుని కలిసే అవకాశం వస్తే.. ఎందుకు ఇలాంటి పని చేసావు అని అడుగుతానంటూ ఆమె తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.