Heart Attack: డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్‌.. క్షణాల్లో మృతి! వీడియో

గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా పలు చోట్ల వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పసి పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు పలువురు చనిపోతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన కలకలం రేపింది..

Heart Attack: డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్‌.. క్షణాల్లో మృతి! వీడియో
Head Constable Dies Of Heart Attack
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 30, 2024 | 3:56 PM

ఢిల్లీ, ఆగస్టు 30: గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా పలు చోట్ల వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పసి పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు పలువురు చనిపోతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఉత్తర ఢిల్లీలోని రూపనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు కానిస్టేబుల్‌ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

ఢిల్లీ రూప్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్‌.. స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో ఫేర్‌వెల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ వీడ్కోలు పార్టీ జరుగుతుండగా, ఆ పార్టీకి హాజరైన హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ఇతరులతో కలిసి హుషారుగా పలు పాటలకు డ్యాన్స్‌ చేశాడు. ఈ క్రమంలో డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో తోటి సిబ్బంది అతడిని హుటాహుటీన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రవికుమార్‌ అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో అప్పటివరకు తమతో సరదగా నవ్వుతూ డ్యాన్స్‌ చేసిన కానిస్టేబుల్‌ మృతి చెందడంతో తోటి సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

వీడియో ఇక్కడ చూడండి..

కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్‌ 2010లో ఢిల్లీ పోలీస్‌ విభాగంలో చేరాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ అప్పటికే గుండె సమస్యతో బాధపడుతున్నాడు. అతను 45 రోజుల క్రితం యాంజియోగ్రఫీ కూడా చేయించుకున్నాడు.హెడ్‌ కానిస్టేబుల్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రవి కుమార్ అందరితో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.