RRB Railway Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సికింద్రాబాద్లో ఎన్ని పోస్టులున్నాయంటే
భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రైల్వే రీజియన్లలో పారామెడికల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,376 పారా మెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి హ్మదాబాద్, చెన్నై, ముజఫర్పూర్..
భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రైల్వే రీజియన్లలో పారామెడికల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,376 పారా మెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి హ్మదాబాద్, చెన్నై, ముజఫర్పూర్, అజ్మేర్, గోరఖ్పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్కతా, సికింద్రాబాద్, బిలాస్పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం.. రైల్వే రీజియన్లలో పోస్టింగ్ ఇస్తారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
- డైటీషియన్ (లెవల్-7) పోస్టుల సంఖ్య: 05
- నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల సంఖ్య: 713
- అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల సంఖ్య: 04
- క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టుల సంఖ్య: 07
- డెంటల్ హైజీనిస్ట్ పోస్టుల సంఖ్య: 03
- డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 20
- హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-III పోస్టుల సంఖ్య: 126
- ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టుల సంఖ్య: 27
- పెర్ఫ్యూషనిస్ట్ పోస్టుల సంఖ్య: 02
- ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 20
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టుల సంఖ్య: 02
- క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 02
- ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టుల సంఖ్య: 246
- రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 64
- స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల సంఖ్య: 01
- కార్డియాక్ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 04
- ఆప్టోమెట్రిస్ట్ పోస్టుల సంఖ్య: 04
- ఈసీజీ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 13
- ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 94
- ఫీల్డ్ వర్కర్ పోస్టుల సంఖ్య: 19
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్/ జీఎన్ఎం/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 26, 2024 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు రూ.250, ఇతరులకు రూ.500 చొప్పున చెల్లించాలి. సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష తేదీలు..
రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రొఫెషనల్ ఎబిలిటీ విభాగంలో 70 ప్రశ్నలకు 70 మార్కులు, జనరల్ అవేర్నెస్ విభాగంలో 10 ప్రశ్నలలకు 10 మార్కులు, జనరల్ అరిథ్మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల్లో 10 ప్రశ్నలకు 10 మార్కులు, జనరల్ సైన్స్ విభాగంలో 10 ప్రశ్నలకు 10 మార్కుల చొప్పున అడుగుతారు. 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.