AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man-Eater Wolves: నరమాంస భక్షనకు అలవాటుపడిన తోడేళ్లు.. భయం గుప్పిట్లో ఆ 30 గ్రామాల ప్రజలు

ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌లో పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తోడేళ్లు. వరుస దాడులకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టుకునేందుకు 'ఆపరేషన్‌ భేడియా' చేపట్టింది. తోడేళ్ల దాడిలో ఇటీవల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 25 నుంచి 30 గ్రామాలు భయంతో బిక్కుబిక్కుమంటూ..

Man-Eater Wolves: నరమాంస భక్షనకు అలవాటుపడిన తోడేళ్లు.. భయం గుప్పిట్లో ఆ 30 గ్రామాల ప్రజలు
Operation Bhediya In UP
Srilakshmi C
|

Updated on: Aug 30, 2024 | 7:56 PM

Share

బహ్రెయిచ్‌, ఆగస్టు 30: ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌లో పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తోడేళ్లు. వరుస దాడులకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టుకునేందుకు ‘ఆపరేషన్‌ భేడియా’ చేపట్టింది. తోడేళ్ల దాడిలో ఇటీవల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 25 నుంచి 30 గ్రామాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

గత 45 రోజుల్లో నరమాంసం రుచి మరిగిన తోడేళ్ళు.. బహ్రైచ్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలు మరియు ఒక మహిళతో సహా ఎనిమిది మంది వ్యక్తులను చంపి తిన్నాయి. మరో 25 మందిపై దాడి చేసి గాయపరిచాయి. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 50 వేలమంది కంటిపై కునుకులేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గురువారం అటవీ శాఖ దాడులకు పాల్పడుతున్న తోడేళ్లలో ఒకదాన్ని పట్టుకోవడంతో మొత్తం తోడేళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. మరో రెండింటికి కోసం జోరుగా గాలింపు చర్యలు చేపట్టారు.

బారాబంకీ డివిజినల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, ‘ఆపరేషన్‌ భేడియా’ ఇన్‌ఛార్జి ఆకాశ్‌దీప్‌ బధవాన్‌ మాట్లాడుతూ.. సిసయ్య చూడామణి గ్రామం సమీపంలో తాము ఏర్పాటు చేసిన వలల్లో ఒక మగ తోడేలు పడిందన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎన్ని తోడేళ్లు తిరుగుతున్నాయో స్పష్టంగా తెలియడం లేదని అధికారులు చెప్తున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ టెక్నిక్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రజానివాసాలపై దాడులు చేస్తున్న జంతువులను పట్టుకునేందుకు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో తోడేళ్లను పట్టుకునేందుకు మొత్తం 16 బృందాలు పనిచేస్తున్నాయని, 12 మంది జిల్లా స్థాయి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారని ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (వైల్డ్ లైఫ్) సంజయ్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. మిగిలిన తోడేళ్లను పట్టుకునే వరకు అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రేణు సింగ్ సైట్‌లోనే ఉంటారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.