AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana jobs: విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్‌..! ఖాళీలపై తేలని పంచాయితీ

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. అక్టోబరులో విద్యుత్‌ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను పంపించాలని విద్యుత్‌ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4 విద్యుత్‌ సంస్థల్లో కలిపి మొత్తం 3 వేలకు పైగా ఖాళీలున్నట్లు తేలింది..

Telangana jobs: విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్‌..! ఖాళీలపై తేలని పంచాయితీ
Telangana Electricity Companies
Srilakshmi C
|

Updated on: Sep 01, 2024 | 4:51 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 1: తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. అక్టోబరులో విద్యుత్‌ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను పంపించాలని విద్యుత్‌ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4 విద్యుత్‌ సంస్థల్లో కలిపి మొత్తం 3 వేలకు పైగా ఖాళీలున్నట్లు తేలింది. ఇందులో పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీచేసే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో క్యాడర్‌ వారీగా ఖాళీల వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు, ట్రాన్స్‌కోలలో పెద్దఎత్తున పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. జెన్‌కోలో ఇంకా మరికొందరికి ఇవ్వవల్సి ఉంది. ఈ పదోన్నతులతో కిందిస్థాయిలో 3 వేలకు పైగా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తేలింది. వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. డిస్కంలలో కిందిస్థాయిలో అసిస్టెంటు లైన్‌మెన్, జూనియర్‌ లైన్‌మెన్, సబ్‌ ఇంజినీర్లు, సహాయ ఇంజినీరుతోపాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ట్రాన్స్‌కో, జెన్‌కోలలో అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.

ఇదిలా ఉంటే జెన్‌కోలో పదోన్నతులపై వివాదం నెలకొంది. మరో రెండు నెలల్లో యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీనికి అవసరమైన అసిస్టెంట్ డివిజినల్‌ ఇంజినీరు (ఏడీఈ), డివిజినల్, పర్యవేక్షక ఇంజినీరు పోస్టులను సైతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయబోతున్నారు. వీటితో కిందిస్థాయిలో భారీగా అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులు ఖాళీ అవుతాయి. ఏడేళ్ల క్రితం భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పోస్టులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యాదాద్రిలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాబోతున్నందున పైస్థాయి పోస్టుల భర్తీకి పదోన్నతులు ఇప్పుడే ఇవ్వాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉత్పత్తి ప్రారంభమయ్యాకే ఇస్తామని జెన్‌కో యాజమాన్యం చెబుతోంది. దీంతో పదోన్నతుల విషయంలో తాడో పేడో ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.

పెగడపల్లిలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వహణను జెన్‌కోకు అప్పగిస్తారని దానికి అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఈ నిర్వహణ పనులను టెండరులో ఓ ప్రైవేటు సంస్థ దక్కించుకుంది. దీంతో ఈ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. వాటిని కూడా పదోన్నతుల ద్వారా నింపేసి భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని సంఘాలు కోరుతున్నాయి. దీనివల్ల పోస్టులు పెరిగి, ఆర్థికభారం పెరుగుతుందని యాజమాన్యం ఆపివేసింది. ఈ వివాదం తేలితేనే మొత్తం ఖాళీ పోస్టులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..