Paralympics 2024: పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన పాలు అమ్మే వ్యక్తీ కూతురు.. పెళ్లి జరగదు అన్నవారి నోట ప్రశంసల వర్షం

పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ప్రీతీ పాల్ విజయగాథ చూస్తే ఆమె జర్నీ అంత సింపుల్ ఏమీ కాదు. ప్రీతి పాల్ యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా హషంపూర్ గ్రామ నివాసి. చిన్నప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతోంది. ప్రీతి తండ్రి అనిల్ కుమార్ పాల్ పాల డెయిరీని నడుపుతున్నాడు. తన నలుగురు తోబుట్టువులలో ప్రీతి రెండవది.

Paralympics 2024
Follow us

|

Updated on: Sep 02, 2024 | 2:33 PM

పరుగు పందెం అయినా వెయిట్ లిఫ్టింగ్ అయినా అసలు క్రీడా ఏదైనా సరే ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకం గెలిస్తే తన కల సాకారం అయినట్లే అని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు. అదే విధంగా 23 ఏళ్ల ప్రీతీ పాల్ కూడా దేశానికి పతకం అందించాలని కల కన్నది. తన కలను సాకారం చేసుకుని కేవలం 48 గంటల్లోనే రెండుసార్లు పారిస్ పారాలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ఆమె కారణమైంది. ప్రీతీ పాల్ ఆగస్టు 30న 100 మీటర్ల రేసులో, సెప్టెంబరు 1వ తేదీన 200 మీటర్ల రేసులో కాంస్యం గెలుచుకుంది, దీనితో పారాలింపిక్ గేమ్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో భారతదేశం నుంచి 2 పతకాలు సాధించిన మొదటి మహిళగా నిలిచింది.

సెరిబ్రల్ పాల్సీ అనే బ్రేకర్‌ను ట్రిప్ చేయడం

పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ప్రీతీ పాల్ విజయగాథ చూస్తే ఆమె జర్నీ అంత సింపుల్ ఏమీ కాదు. ప్రీతి పాల్ యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా హషంపూర్ గ్రామ నివాసి. చిన్నప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతోంది. ప్రీతి తండ్రి అనిల్ కుమార్ పాల్ పాల డెయిరీని నడుపుతున్నాడు. తన నలుగురు తోబుట్టువులలో ప్రీతి రెండవది.

కోచ్ దగ్గర శిక్షణ తీసుకుని అద్భుతాలు చేస్తున్న ప్రీతి

తండ్రి అనిల్ కుమార్ పాల్ తన కుమార్తె అనారోగ్యానికి మీరట్ నుంచి ఢిల్లీకి తీసుకుని వెళ్లి మరీ చికిత్స చేయించారు. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ప్రీతి జీవితంలో ఏదైనా సాధించాలని భావించింది. తనకు వచ్చిన దానినే శక్తిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం తీసుకుని ప్రీతీ పాల్ జర్నీ మొదలు పెట్టింది. కోచ్ గజేంద్ర సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటూ నెమ్మదిగా జీవితంలో పురోగతి నిచ్చెనలను అధిరోహించడం ప్రారంభించింది.

పారిస్ కంటే ముందు జపాన్‌లో పతకం సాధించిన ప్రీతి పారిస్ పారాలింపిక్స్‌లో భారత జెండాను ఎగురవేయడానికి ముందు, ప్రీతి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా తన పేరును లిఖించుకుంది. 2024లో జపాన్‌లో జరిగిన ఆ పోటీలో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. ఇక, ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌లో ఒకదాని తర్వాత ఒకటి రెండు పతకాలు సాధించడం ద్వారా త్రివర్ణ పతకాన్ని రెండు సార్లు ఎగురవేసే అవకాశం లభించింది.

పెళ్లిలో సమస్యలు వస్తాయన్న వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు

యూపీకి చెందిన ఓ పాలు అమ్మే వ్యక్తి కూతురు ఇప్పుడు ఇండియాకే డార్లింగ్‌గా మారింది. తన కూతురు వికలాంగురాలు కనుక పెళ్లికి సమస్యలు వస్తాయని ప్రజలు తనతో చెప్పేవారని ప్రీతి తండ్రి అనిల్ కుమార్ పాల్ చెప్పారు. పారిస్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని వారె తనకు చెబుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట తన కూతురు మరింత పెంచేలా చేసింది అంటూ గర్వంగా చెబుతున్నారు అనిల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ప్రీతి..

అర్జున్ రెడ్డి - సందీప్ రెడ్డి వంగా పై విజయ్ దేవరకొండ ట్వీట్.!

తక్షణ సాయం అందించండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

పవన్ కల్యాణ్ సేవలో తరిస్తోన్న ఈ పిల్లలను గుర్తు పట్టారా?

ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? డయాబెటిస్‌ కావొచ్చు..

మగాళ్లు ఎవ్వరూ స్పందించడం లేదు..
మగాళ్లు ఎవ్వరూ స్పందించడం లేదు..
టీజీపీఎస్సీ గ్రూప్‌-3 అభ్యర్ధులకు మరో ఛాన్స్‌.. నేటి నుంచి అవకాశం

పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

సౌత్ గుడ్. నార్త్ వాళ్ళు సక్సెస్ ల మీద ఫోకస్ పెట్టాలిఅంటూ తాప్సీ!

మహిళలకు వడ్డీలేని రూ.5 లక్షల రుణం..మోడీ సర్కార్‌ అద్భుతమైన స్కీమ్
మహిళలకు వడ్డీలేని రూ.5 లక్షల రుణం..మోడీ సర్కార్‌ అద్భుతమైన స్కీమ్
పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
శభాష్​ పోలీస్‌.. వరద కష్టాల్లో బాధితులకు అండగా నిలిచిన ఖాకీలుమరిప

వరదలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే ఇలా

వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవుతారు

పడుకుందామని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ వేశారు.. పైనుంచి బుసలు విని షాక్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరింత వర్షసూచన.!

కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత పరవళ్లు..

అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?

రైళ్లపై దాడులు చేయండి.! స్లీపర్‌ సెల్స్‌కుపాక్‌ ఉగ్రవాది వీడియో..

ఛీ.. వీడు అసలు తండ్రేనా.! కూతురికి డ్రింక్ ఇచ్చి అఘాయిత్యం..!