Kapil Dev: ‘ప్రపంచం మీపై ఉమ్మేస్తోంది..’: కపిల్ దేవ్‌పై యూవీ తండ్రి షాకింగ్ కామెంట్స్..
Yuvraj Singh Father Yograj Angry Shocking Comments on Kapil Dev: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి తన ప్రకటనలతో వార్తల్లో నిలిచారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, యోగరాజ్ సింగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు భారతదేశానికి మొదటి వన్డే ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు.
Yuvraj Singh Father Yograj Angry Shocking Comments on Kapil Dev: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి తన ప్రకటనలతో వార్తల్లో నిలిచారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, యోగరాజ్ సింగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు భారతదేశానికి మొదటి వన్డే ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు.
ధోనీ, కపిల్ దేవ్‌ల గురించి యోగరాజ్ సింగ్ బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. యోగరాజ్ సింగ్ భారత జట్టు కోసం ఆడిన సంగతి తెలిసిందే. కపిల్ దేవ్‌తో తన సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడాడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
కపిల్ గురించి యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ, ‘యోగరాజ్ సింగ్ ఏమిటో ప్రజలకు చూపించాలనుకుంటున్నాను. నన్ను చాలా తక్కువగా చేసి చూపించారు. ఈ రోజు ప్రపంచం నా పాదాల చెంత ఉంది. చాలా చెడ్డ పనులు చేసిన వారిని సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. అలాంటి ఓ వ్యక్తిని మీరు ఆల్ టైమ్ దిగ్గజ కెప్టెన్ చేశారు. ఆయనెవరో మీకు తెలుసు. మిస్టర్ కపిల్ దేవ్. 1981లో అతను నన్ను జట్టు నుంచి తొలగించాడు. నేను బాగా ఆడుతున్న తరుణంలో పక్కనె పెట్టేశారు. ఇందుకు శిక్షగా నీపై ప్రపంచం ఉమ్మివేస్తుందని ఆరోజే చెప్పాను. ఈ రోజు యువరాజ్ సింగ్ వద్ద 13 ట్రోఫీలు ఉన్నాయి. ఆయన వద్ద కేవలం ఒకే ఒక్క ప్రపంచ కప్ ఉంది’ అంటూ ఘాటుగా మాట్లాడాడు.
ధోనిపైనా విమర్శలు..
‘ఎంఎస్ ధోనీని నేను క్షమించను. అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఆత్మవిమర్శన చేసుకోవాలి. అతనో గొప్ప క్రికెటర్ అయితే నా కొడుకుపై ఏం చేశాడో ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ధోనీని జీవితంలో ఎప్పటికీ క్షమించలేను. CSK IPL 2024లో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయారు? నువ్వు ఏ గింజ నాటితే అదే మొక్క వస్తుంది. యువరాజ్ సింగ్ ICC అంబాసిడర్, అతనికి సెల్యూట్.! అహంకారి ధోనీ ఎక్కడున్నాడు? అతను యువరాజ్‌తో కరచాలనం కూడా చేయలేదు. అందుకే ఈ సంవత్సరం CSK విఫలమైంది’ అంటూ విమర్శించారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని..
ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 43 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అతనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రంగంలోకి దింపేందుకు బీసీసీఐని ఒప్పించేందుకు CSK ప్రయత్నిస్తోందని కొన్ని మీడియా కథనాలలో వెల్లడైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..