Jammu Kashmir: వైష్ణో దేవి భవన్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు, ఇద్దరు మహిళా భక్తులు మృతి, ఒకరికి గాయాలు

ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయని శ్రీ మాతా వైష్ణో దేవి మందిరం బోర్డు సీఈవో ధృవీకరించారు. కొండచరియలు విరిగిపడిన సమాచారం అందిన వెంటనే పుణ్యక్షేత్రం బోర్డు విపత్తు నిర్వహణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మధ్యాహ్నం 2.35 గంటలకు పంచి సమీపంలో భవనానికి మూడు కిలోమీటర్ల దూరంలో కొండచరియలు విరిగిపడ్డాయని.. దీని కారణంగా ఎగువ ఇనుప నిర్మాణంలో కొంత భాగం కూడా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు.

Jammu Kashmir: వైష్ణో దేవి భవన్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు, ఇద్దరు మహిళా భక్తులు మృతి, ఒకరికి గాయాలు
Landslide On Vaishno Devi Track
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2024 | 4:26 PM

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణో దేవి భవన్ రోడ్డులో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పంచి హెలిప్యాడ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందారు. ఒక బాలిక గాయపడింది. సంఘటన గురించి తెలిసిన వెంటనే వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు రంగంలోకి దిగి రిలీఫ్ అండ్ రెస్క్యూ వర్క్ ను ప్రారంభించారు. మరోవైపు వైష్ణో దేవి ఆలయానికి రాకపోకలపై ప్రయాణాన్ని నిషేధించలేదు. మరో మార్గం గుండా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయని శ్రీ మాతా వైష్ణో దేవి మందిరం బోర్డు సీఈవో ధృవీకరించారు.

కొండచరియలు విరిగిపడిన సమాచారం అందిన వెంటనే పుణ్యక్షేత్రం బోర్డు విపత్తు నిర్వహణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మధ్యాహ్నం 2.35 గంటలకు పంచి సమీపంలో భవనానికి మూడు కిలోమీటర్ల దూరంలో కొండచరియలు విరిగిపడ్డాయని.. దీని కారణంగా ఎగువ ఇనుప నిర్మాణంలో కొంత భాగం కూడా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళలను గురుదాస్‌పూర్‌లోని జ్ఞాన్‌పూర్ గాలి నంబర్ 2 నివాసి సుదర్శన్ భార్య సప్న , యుపిలోని కాన్పూర్‌లో నివసిస్తున్న నేహాగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హిమకోటి రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. పాత సంజిచాట్ మార్గం గుండా ప్రయాణం కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

వర్షం కారణంగా విరిగిపడిన కొండచరియలు

అంతకుముందు ఆగష్టు 15 న దక్షిణ డియోరీ సమీపంలోని శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి, యాత్రికుల కోసం పవిత్ర ఆలయానికి ప్రయాణానికి తాత్కాలికంగా అంతరాయం కలిగింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాల మధ్య ఈ ఘటన జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ఘటన అనంతరం రోడ్డుపై నిలిచిపోయిన భక్తుల రాకపోకలు

ప్రతికూల వాతావరణం కారణంగానే కొండచరియలు విరిగిపడినట్లు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. రానున్న రెండు వారాల పాటు ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై భక్తుల రద్దీ లేకపోవటం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడిన రహదారిపై భక్తుల రాకపోకలను నిలిపివేశారు.

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

యాత్ర సమయంలో భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని, రహదారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుపై ఉన్న చెత్తను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెత్తను తొలగించిన తర్వాత ఒకసారి తనిఖీ చేస్తారు. ఆ తర్వాత రోడ్డు తెరవడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..